Alekhya Chitti pickles:అలేఖ్య చిట్టి సిస్టర్స్ (Alekhya Chitti pickles) ఒక్క దెబ్బతో ఎంత పాపులారిటీ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ పచ్చళ్ళు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు.. అనూహ్యంగా కస్టమర్ తో వ్యవహరించిన తీరుకి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఆఖరికి బిజినెస్ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిజినెస్ పెట్టిన 11 నెలల కాలంలోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అలేఖ్య సిస్టర్స్.. ధరలు అడిగిన కస్టమర్ పై అనుచిత్ర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో చాలామంది నెటిజన్స్ ఈ అలేఖ్య చిట్టి సిస్టర్స్ పై విమర్శలు గుప్పించారు. ట్రోల్స్ చేశారు. ఆఖరికి సినిమా ప్రమోషన్స్ లో కూడా వీరి డైలాగ్స్ వాడుకున్నారు అంటే.. ఇక ఎంతలా సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మళ్లీ బిజినెస్ మొదలుపెట్టిన అలేఖ్య చిట్టి సిస్టర్స్..
ముఖ్యంగా అలేఖ్య చిట్టి సిస్టర్స్ లో ఒకరైన అలేఖ్య.. ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అని అడిగిన కష్టమర్ తో.. పికిల్సే కొనలేని వాడివి.. పెళ్ళాం కి బంగారం ఏం కొనిపెడతావు.. ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేసింది.అయితే సదరు కస్టమర్ ఆ విషయాన్ని స్క్రీన్ షాట్ తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి. ఈమె మాట్లాడిన తీరుకి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంది. దెబ్బకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఐసీయూలో కూడా చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈమె తాజాగా మళ్లీ తన అక్కలతో కలిసి మళ్లీ పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెట్టింది.
పిక్నిక్ కి వెళ్లిన అలేఖ్య సిస్టర్స్..
అయితే ఈసారి అందరికీ అందుబాటు ఉండేలా ధరలు ప్రకటిస్తూ.. తక్కువ క్వాంటిటీతో కూడా పచ్చళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపోతే ఈ పచ్చళ్ళ ప్రమోషన్స్ కోసం ఈ అక్కాచెల్లెళ్ళు పడుతున్న తంటాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఇకపోతే తాజాగా వీరు ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన ఒక వీడియో అందరూ తలలు పట్టుకునేలా చేస్తోంది. పిక్నిక్ కి వెళ్ళామంటూ చెప్పిన వీరు పిక్నిక్ లో పికిల్స్ ప్రమోట్ చేయడం పై పలువురు పలు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
పిక్నిక్ లో పికిల్స్ తింటూ..
తాజాగా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు గార్డెన్ పిక్నిక్ అంటూ ఒక జీడి మామిడి తోటకి వెళ్లారు. కార్తీక మాసం రాకుండానే శ్రావణ మాసంలోనే వనభోజనాలకు వెళ్ళాము అంటూ చెప్పిన సుమా.. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.వనభోజనాలు అనగానే కట్టెల పొయ్యి వెలిగించి వీరేదో వంట చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా తాము తెచ్చుకున్న పచ్చళ్లను సర్దేసి..ఈ విధంగా తమ పచ్చళ్ళను ప్రమోట్ చేసుకున్నారు. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికిల్స్, అలేఖ్య చిట్టి పౌడర్ తో పాటు సున్నుండలు తమ వద్ద ఉన్నాయి అంటూ.. పిక్నిక్ కి వచ్చి వంటలు చేసి కష్టపడి పోవడం కంటే ఇలా అలేఖ్య చిట్టి పికిల్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అంటూ తమ పికిల్స్ ని ప్రమోట్ చేసుకున్నారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ అంతా పిక్నిక్ అని వెళ్లి పికిల్స్ తినడం ఏంటి.. మీ ప్రమోషన్ పాడుగాను అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
గెటప్ మార్చేసిన అలేఖ్య..
ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం ఏమిటంటే అలేఖ్య గెటప్ అని చెప్పాలి పూర్తిగా బాయ్ కట్ లోకి మారిపోయింది. వేషధారణతో పాటు హెయిర్ స్టైల్ మొత్తం మార్చేసింది అలేఖ్య. అలేఖ్య చిట్టి పికిల్స్ లో భాగంగా సుమా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Sathi Leelavathi: ఆకట్టుకుంటున్న సతీ లీలావతి ‘చిత్తూరు పిల్ల’ లిరికల్ సాంగ్!