Film industry: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత చాలామంది లేడీ ఆర్టిస్టులు తమ బాధలను మీడియాతో చెప్పుకుంటున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి చెబితే.. మరి కొంత మంది వ్యక్తిగత విషయాలపై కూడా నోరు మెదుపుతున్నారు. అలా తాజాగా తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది ప్రముఖ నటి గాయత్రీ గుప్త (Gayatri Gupta). ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో చేసిన ఈమె.. అటు సినిమాలతో పాటు ఇటు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేసి సంచలనం సృష్టించిన ఈమె ఇప్పుడు తన కన్న తండ్రి తన పాలిట కసాయిగా మారాడు అంటూ చెప్పుకొచ్చింది.
కన్న తండ్రి దారుణంగా హింసించాడు – గాయత్రి గుప్తా
సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించిన ఈమె.. గతంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే రేంజ్ లో కామెంట్లు చేసింది. ఇప్పుడు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తనను పిచ్చిగా కొట్టేవాడు అని.. కరెంటు వైర్లతో కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు అంటూ తెలిపింది..
డ్రాప్ చేస్తామని దాడి చేశారు..
ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనపై చాలా లైంగిక దాడులు కూడా జరిగాయి అంటూ ఎమోషనల్ అయ్యింది గాయత్రి గుప్తా. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” ఇలా నేను బహిరంగంగా ఇండస్ట్రీలో జరిగిన విషయాలను కూడా బయటకు చెప్పడం వల్లే ఇండస్ట్రీలో చాలా సమస్యలు వచ్చాయి. అవకాశాలు రాకుండా చేశారు. అయితే నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా కమిట్మెంట్ తో వెళ్లలేదు. ఇదిలా ఉండగా ఒక సినిమా పార్టీలో అనుకోని పరిస్థితుల్లో మందు తాగాల్సి వచ్చింది. అప్పుడు నన్ను ఒక డైరెక్టర్ డ్రాప్ చేస్తానని చెప్పి.. ఒక నిర్మాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆరోజు ఆ నిర్మాత నా డ్రెస్ లాగడం, నాతో పిచ్చిగా ప్రవర్తించడం చేశాడు. కానీ నేను వేసుకున్న డ్రెస్సే నన్ను కాపాడింది. ఒక గంట సేపు నన్ను ఇబ్బంది పెట్టి ఇక వర్క్ అవుట్ కాలేదని వదిలేశాడు.. తర్వాత ఒక ఈవెంట్ మేనేజర్ కూడా నాతో చెత్తగా ప్రవర్తించాడు” అంటూ గాయత్రి గుప్తా తెలిపింది.
జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొన్నాను – గాయత్రి గుప్తా
ఇలాంటివి తన జీవితంలో ఎన్నో జరిగాయి అని, నా అనుకున్న వాళ్లు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గాయత్రి గుప్తా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కన్నా తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ప్రస్తుతం గాయత్రీ గుప్తా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
also read: Priyamani: బాలీవుడ్ పై విరుచుకుపడ్డ ప్రియమణి.. ఇప్పటికైనా మారడంటూ?