E-Paper
Advertisement

Netflix : యూజర్లకు మరో షాక్ ఇవ్వనున్న నెట్ ఫ్లిక్స్

Netflix : యూజర్లకు మరో షాక్ ఇవ్వనున్న నెట్ ఫ్లిక్స్
Advertisement

Netflix : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్, వీడియో స్ట్రీమింగ్ దిగ్గజమైన నెట్ ఫ్లిక్స్ మరోసారి యూజర్లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని వాలస్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. త్వరలో లేదా వచ్చే ఏడాది నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ధరలను పెంచనుందంటూ జర్నల్ కథనంలో పేర్కొంది. గతంలో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ధరల పెంపుపై వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ.. అవి నిజమేనంటూ.. తన కథనంలో హైలెట్ చేసింది. అయితే.. సబ్ స్క్రిప్షన్ మార్పులపై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ముందుగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ నెలవారీ సబ్ స్క్రిప్షన్స్, వార్షిక సబ్ స్క్రిప్షన్ల ధరల పెంపుపై తీసుకునే నిర్ణయం భారత యూజర్లకు కూడా వర్తిస్తుందా ? లేదా ? అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే.. గ్లోబల్ మార్కెట్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాదే ధరలను పెంచిన నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు మరోసారి ధరలను పెంచనుందని తెలిసి యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాస్ వర్డ్ షేరింగ్ పై కూడా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులకే ఆ విధానానికి స్వస్తి పలకడంతో యూజర్లు పెరిగారు. కానీ.. మళ్లీ సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచుతుండటంతో.. నెట్ ఫ్లిక్స్ కు బదులు ఇతర ఓటీటీ నెట్ వర్క్ లను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×