E-Paper
Advertisement

Niharika: విడాకుల వెనుక ఆ హీరోయిన్ హస్తం ఉందా..వెలుగులోకి సంచలన నిజం..!

Niharika: విడాకుల వెనుక ఆ హీరోయిన్ హస్తం ఉందా..వెలుగులోకి సంచలన నిజం..!
Advertisement

Niharika.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా రాలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటివారి కోసం నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్ కాలేదు. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత యాంకర్ గా మారి సక్సెస్ అవ్వాలనుకుంది. కానీ అక్కడ కూడా సక్సెస్ వరించలేదు. దీంతో ఒక మనసు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంది కానీ అక్కడ కూడా ఈమెకు బెడిసి కొట్టిందనే చెప్పాలి.

పెద్దల కోరిక మేరకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న నిహారిక..

Advertisement

అయితే ఇదిలా ఉండగా కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు చైతన్య జొన్నలగడ్డను సాంప్రదాయ పద్ధతిలో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజులకే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విడాకుల బాధ నుంచి ఇప్పుడే బయటపడిన ఈమె తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి కమిటీ కుర్రోళ్ళు సినిమా తీసి, నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక ఇప్పుడు మరో సినిమాను నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

సమంత ఇన్స్పిరేషన్..

Advertisement

ఇదిలా ఉండగా.. నిహారిక విడాకుల వెనుక ఒక హీరోయిన్ హస్తం ఉంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకెళితే, నిజానికి తన భర్త నుంచి విభేదాలు వచ్చినప్పుడు నిహారిక విడాకులు తీసుకోవాలని అనుకోలేదట కానీ అప్పటికే విడాకులు తీసుకున్న హీరోయిన్ సమంత ను చూసి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందని సమాచారం. అయితే ఒక ఉమెన్ ఎందుకు అణిగి మణిగి ఉండాలి..? తనకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒకరి దగ్గర కష్టాన్ని భరించాలి.? అన్న కంక్లూషన్ కి వచ్చి.. ఆ తర్వాత హీరోయిన్ సమంతను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాగచైతన్యకు సమంత ఎలా అయితే విడాకులు ఇచ్చిందో.. అదే విధంగా చైతన్య జొన్నలగడ్డకు నిహారిక కూడా విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విడాకులకు అప్లై చేసినట్లు సమాచారం.

విడాకుల తర్వాత నిర్మాతగా సక్సెస్..

ఈ విషయం విన్నప్పుడు మెగా ఫ్యామిలీ నిహారికపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కానీ ఆ తర్వాత ఆలోచించి నిహారిక ఆనందమే ఇంపార్టెంట్ అంటూ సర్దుకుపోయినట్లు సమాచారం. అలా సమంతకు తెలియకుండానే నిహారిక విడాకుల మేటర్ లో సమంత కీలక పాత్ర పోషించిందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సమంత లాగే నిహారిక కూడా చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సంతోషంగా ఉంది. ప్రస్తుతం నిర్మాతగా మారి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తర్వాత అదే దారిలో వెళ్లి ఇప్పుడు మరింత సక్సెస్ అయ్యింది నిహారిక.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×