BigTV English

Niharika Konidela: అల్లు అర్జున్ తో విబేధాలు.. నిహారిక క్లారిటీ ఇచ్చేసింది ఇలా

Niharika Konidela: అల్లు అర్జున్ తో విబేధాలు.. నిహారిక క్లారిటీ ఇచ్చేసింది ఇలా

Niharika Konidela: మెగా- అల్లు కుటుంబం మధ్య ఏం జరుగుతుంది అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఎప్పటినుంచో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అని రూమర్స్ వినిపించాయే కానీ, వాటిలో నిజమెంత, అబద్ధమెంత అనేది ఎవరికి తెలియలేదు. కానీ, ఎప్పుడైతే అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో వైసీపీ నేతకు సపోర్ట్ చేశాడో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ లో నిజం ఉందని ఫ్యాన్స్ నమ్మడం మొదలుపెట్టారు.


సొంత మామకు సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి చెందిన వ్యక్తికీ బన్నీ అండగా ఉండడం మెగా ఫ్యాన్స్ కు గిట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో బన్నీని మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి తోడు అప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ మరింత హీట్ పెంచింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ మావాడు కాదు అని చెప్పుకొచ్చాడు.

ఇక రెండు రోజులకు ముందు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అల్లు అర్జున్,అతని భార్య స్నేహ రెడ్డిని అన్ ఫాలో చేసి.. తాను కూడా బన్నీని దూరం పెట్టినట్లు చెప్పకనే చెప్పాడు. ఇంత జరుగుతున్నా కూడా మెగా కుటుంబం కానీ, అల్లు కుటుంబం కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రం దొరికిపోయింది. ఆమె ఈ ప్రశ్న నుంచి తప్పించుకోలేకపోయింది.


నిహారిక ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె నిర్మిస్తున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నిహారికకు, మెగా – అల్లు కుటుంబాల మధ్య జరుగుతున్న వైరం గురించి ప్రశ్న ఎదురైంది. అల్లు అర్జున్ కు మెగా కుటుంబానికి మధ్య విబేధాలు ఉన్నాయని అంటున్నారు.

ఇకఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ .. అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేశాడు దానిపై మీ స్పందన ఏంటి అని అడగ్గా.. నిహారిక స్పందిస్తూ.. ” జెన్యూన్ గా చేశారు అన్నది ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తోంది. నాకు ఈ విషయం తెలియదు. కానీ, ఏది జరిగినా అది వారి స్వంత కారణాల వలన జరిగింది” అని చెప్పింది. ఇక నిహారిక చెప్పడంతో ఇది కచ్చితంగా చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది అని తెలుస్తోంది. మరి దీనిపై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×