E-Paper
Advertisement

Niharika Konidela: విడాకుల‌పై తొలిసారి స్పందించిన నిహారిక.. మాజీ భ‌ర్త స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!

Niharika Konidela: విడాకుల‌పై తొలిసారి స్పందించిన నిహారిక.. మాజీ భ‌ర్త స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
Advertisement

Niharika Konidela: మెగా డాటర్ కొణిదెల నిహారిక సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అటు హీరోయిన్‌గా.. ఇటు నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో తల్లిదండ్రుల కోరిక మేరకు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నా.. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేకపోయారు. ఫలితంగా చైతన్యతో విడాకులు తీసుకున్నారు. అతడితో విడాకులు తర్వాత నిహారిక కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

అయితే ఈ మధ్య మాత్రం నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఓ పాడ్ కాస్ట్ ఇంటర్యూలో తన పెళ్లి, విడాకులపై ఆమె మొదటి సారి స్పందించారు.

Advertisement

తమది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవితం బాగా ఉండాలని అంతా అనుకుంటారు. అలానే తాను కూడా అనుకున్నట్లు తెలిపారు. కానీ, తన జీవతంలో అది నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నానని ఆమె తెలిపారు. విడాకుల తర్వాత ప్రతీ క్షణం ఒక యుగంలా గడిచిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్‌గా నిలబడిందని అన్నారు. దీంతో జీవితం ఇక్కడితో ఆగిపోలేదని తెలుసుకొని ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

అయితే నిహారిక వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య రెస్పాండ్ అయి హాట్ కామెంట్స్ చేశారు. నిహారికపై వచ్చిన నెగిటివిటి గురించి మాట్లాడి అందరికీ తెలియజేసినందుకు తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని తనకు కూడా తెలుసని ఆయన ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. కానీ, పరోక్షంగా బాధితులను ట్యాగ్‌ చేయడం మంచిది కాదని చెప్పుకొచ్చారు.

పైగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను చెప్పడం అంతకంటే మంచికాదని చైతన్య అన్నారు. గతంలో కూడా ఇలాగే చేశారు.. ఇది రెండో సారి. ఇలాంటి విషయాలు ఇద్దరినీ మరింతగా బాధిస్తాయని తెలిపారు. విడాకుల విషయంలో ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదని అన్నారు. బాధ నుంచి ఎలా కోలుకోవాలో ఆలోచిస్తే మంచిదని హితబోద చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×