BigTV English

WTF first look : నిహారిక బర్త్డే గిఫ్ట్.. వాట్ ద ఫిష్ సరి కొత్త పోస్టర్..

WTF first look : నిహారిక బర్త్డే గిఫ్ట్.. వాట్ ద ఫిష్ సరి కొత్త పోస్టర్..
What The Fish

WTF first look : టాలీవుడ్ లో తన లక్ ట్రై చేయడానికి ఒక మనసు మూవీ తో ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్సెస్.. నిహారిక కొణిదల. ఇప్పటివరకు ఆమె ఐదు సినిమాల్లో నటించింది. కానీ.. ఒక్క సినిమాతో కూడా మెగా రేంజ్ సక్సెస్ రాలేదు. ఇక హీరోయిన్ పాత్రలు లాభం లేదు అనుకుని నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నాలు కూడా చేసింది. ఇటీవల ఒక ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేసింది ఈ మెగా డాటర్.


అయితే మళ్లీ తిరిగి వెండితెరపై నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈరోజు నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సరికొత్త చిత్రానికి సంబంధించి ప్రకటన విడుదల అయ్యింది. ఇంతకీ ఆ మూవీ పేరేమిటో తెలుసా..వాట్ ది ఫిష్. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. మొన్నిమధ్య మంచు మనోజ్ తిరిగి సినిమాలు స్టార్ట్ చేస్తాను అంటూ మెన్షన్ చేసిన మూవీ ఇదే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నిహారిక ఫస్ట్ లుక్కు పోస్టర్ని ఈ రోజు విడుదల చేశారు మూవీ మేకర్స్. పోస్టర్లో సీక్వెల్ షైనింగ్ షార్ట్ డ్రస్ లో రచ్చ పుట్టిస్తున్న నిహారిక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఈ మూవీలో ఆమె అష్టలక్ష్మి క్యారెక్టర్ లో కనిపించనుంది.

ఈ సినిమా ద్వారా వరుణ్ కోరుకుండ డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.6ix సినిమాస్‌ బ్యానర్ పై ఈ మూవీని విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత తన మార్గ కామెడీతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్  ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. మరి ఇప్పుడు నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఇందులో నిహారిక హీరోయిన్ గా నటిస్తోందా లేక ఏదైనా కీలకమైన పాత్ర పోషిస్తుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.


Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×