Nikhil:గత ఏడాది రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య(Lavanya) కేస్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య.. ఇప్పుడు మస్తాన్ సాయి (Masthan Sai) అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. ఈ క్రమంలోనే ఆ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ (Nikhil) ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది. దీంతో ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు నిఖిల్.
లావణ్య లీక్ వీడియో పై స్పందించిన నిఖిల్..
ఈ విషయంపై నిఖిల్ మాట్లాడుతూ.. “కార్తికేయ 2 సక్సెస్ మీట్ జరిగిన తర్వాత డిన్నర్ పార్టీలో తీసిన వీడియోలవి.. అక్కడ ఉన్నది కూడా మా కుటుంబ సభ్యులే. అయితే వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా తెలుసు.. దయచేసి మాలాంటి వారిని తప్పుగా ప్రొజెక్ట్ చేయవద్దు”.. అంటూ నిఖిల్ కామెంట్లు చేశారు. ఇక మొత్తానికైతే లావణ్య.. నిఖిల్ ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడంతో నిఖిల్ స్పందించారు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఏముందంటే..?
లావణ్య పోలీసులకు అందజేసిన మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలతో పాటు పలువురు వ్యక్తుల ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అమ్మాయిలను ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో వంచించి, వారిని డ్రగ్స్ కి బానిసలను చేసి,గదిలో బంధించి వారితో ప్రైవేట్ వీడియోలు తీసి ఇలా హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాడని లావణ్య ఆరోపించింది. ముఖ్యంగా తనను కూడా డ్రగ్స్ లో ఇరికించాలని శేఖర్ భాష (Sekhar basha) తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ వీడియోని కూడా ఆమె పోలీసులకు అందజేసింది. ఇక దీనిపై శేఖర్ భాషా కూడా స్పందించారు.” లావణ్య చాలామందితో అసభ్యకర సంబంధాలు పెట్టుకుందని, ఆమె డ్రగ్స్ వాడి ప్రీతితోపాటు నెదర్లాండ్ అమ్మాయిని కూడా డ్రగ్స్ కు అలవాటు చేసిందని,ఇక అందుకే ఆమెను మస్తాన్ సాయి పట్టిస్తానని చెబితే దానికి నేను సహకరిస్తానని చెప్పినట్లు” కూడా శేఖర్ భాష తెలియజేశారు. ఇక అలా మస్తాన్ సాయి శేఖర్ భాష ఈమెను పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ పై ఆరోపణలు గుప్పించిన లావణ్య..
ఇకపోతే గతేడాది హీరో రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. తనను ప్రేమ పేరుతో వాడుకొని, గర్భం వచ్చేలా చేసి మూడు నెలల గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడని, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కూడా తానే కట్టాడని తెలిపింది. అంతేకాదు తన దగ్గర సుమారుగా రూ. 70 లక్షలకు పైగా డబ్బు రాజు తరుణ్ తీసుకున్నాడని, గత పదేళ్లుగా ఒకే ఇంట్లోనే సహజీవనం చేశామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఇండస్ట్రీలో ఈ విషయంపై పెద్ద హైడ్రామా నడిచిన విషయం అందరికీ తెలిసిందే.