Bali Tour: ఇండియన్ ఎక్కువగా ఇష్టపడే హాలీడే స్పాట్ బాలి. ఇండోనేషియాలోని ఈ ఐలాండ్ ప్రకృతి అందాలతో ఆహా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన బీచ్ లు, ప్రశాంతమైన పురాతన ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నుంచి సింఫుల్ గా బాలికి వెళ్లిరావచ్చు. అదీ తక్కువ ధరలో. ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులు
బాలికి వెళ్లడానికి బెస్ట్ టైమ్ ఏప్రిల్ నుంచి అక్టోబర్. ఈ సమయంలో వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి బాలికి వెళ్లడానికి ఖర్చులు సుమారు రూ. 45 వేల నుంచి రూ. 1.40 లక్షల వరకు అవుతుంది. ఇందులో విమానా టికెట్లు, వీసా, వసతి, సహా అన్ని ఇతర ఖర్చులు ఉంటాయి.
విమాన టికెట్ ధరలు
హైదరాబాద్ నుంచి బాలికి వన్ వే ప్లైట్ టికెట్ ధర సాధారణంగా రూ. 11,500 నుంచి రూ. 15,500 వరకు ఉంటుంది. ఎయిర్ ఏషియా, ఇండిగో, మలేషియా ఎయిర్ లైన్స్ ద్వారా వెల్లొచ్చు. రిటర్న్ టికెట్ ధర రూ. 21,500 నుంచి రూ. 27,500 వరకు ఉంటుంది. మార్చి నెలలో ధరలు తక్కువగా ఉంటాయి. డిసెంబర్, ఆగష్టు నెల్లలో ఎక్కువగా ఉంటాయి. ప్రయాణం రెండు స్టాప్ లతో సింపూర్, కౌలాలంపూర్ లేదంటే హాంకాంగ్ తో సుమారు 8-12 గంటలు పడుతుంది.
వీసా ఖర్చులు
భారతీయ పౌరులకు బాలిలో వీసా ఆన్ అరైవల్ అవకాశం అందుబాటులో ఉంది. దీని సుమారు ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.3000 ఉంటుంది. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందుకోసం కన్ఫర్మ్ అయిన హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, రిటర్న్ టికెట్ ఉండాలి. ఇవి ఉంటేనే వీసా అందిస్తారు.
వసతి ఖర్చులు
బడ్జెట్ హోటళ్లు రోజు రూ. 680 నుంచి రూ. 2000 వరకు ఉంటాయి. మిడ్ రూంజ్ హోటళ్లలో రూ. 4,000 నుంచి రూ. 1000 వేల వరకు ఖర్చు అవుతుంది. లగ్జరీ హోటళ్లలో రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు ఖర్చు అవుతుంది.
ఇతర ఖర్చులు
బాలిలో తిరిగేందుకు టాక్సీలు, బైక్ రెంటల్స్, రైడ్-హెయిలింగ్ సర్వీసెస్ (గ్రాబ్) రోజుకు రూ.500 – రూ.2,000 ఖర్చు అవుతుంది. భోజనం స్థానిక వారంగ్‌లలో రోజుకు రూ.500 –రూ.1,500 అవుతుంది. రెస్టారెంట్లలో రూ.2,000 – రూ.5,000 వేల వరకు అవుతాయి. స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, టెంపుల్ విజిట్స్, బాలి సఫారీ పార్క్ లాంటి యాక్టివిటీలకు రూ. 1,000 – రూ.5,000 వరకు ఖర్చు అవుతాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ రూ. 1,000 నుంచి రూ. 3,000 ఉంటుంది.
Read Also: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?
మొత్తం అంచనా ఖర్చు(1 వ్యక్తికి 6 రాత్రులు/7 రోజులు)
బడ్జెట్ ట్రావెలర్ కు రూ. 41,500 అవుతుంది. విడ్ రేంజ్ ట్రావెలర్ కు రూ.77,500, లగ్జరీ ట్రావెలర్ కు రూ. 10,000 నుంచి రూ. 1,40,000 వరకు అవుతుంది. మేక్ మైట్రిప్, ట్రావెల్ ట్రయాంగిల్, త్రిల్లోఫిలియా లాంటి ట్రావెల్ కంపెనీలు రూ. 50,000 నుంచి రూ. 83,000లో టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి.
Read Also: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?