E-Paper
Advertisement

Nikhil Siddhartha: రియల్ కార్తికేయ.. మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించిన హీరో..

Nikhil Siddhartha: రియల్ కార్తికేయ.. మూసి ఉన్న ఆలయాన్ని తెరిపించిన హీరో..
Advertisement

Nikhil Siddhartha: సినిమాలో హీరోలు.. మంచి చేస్తే సూపర్ హీరో అంటారు. అదే హీరోలు బయట కూడా మంచి చేస్తే రియల్ హీరోలు అంటారు. తాజాగా కుర్ర హీరో నిఖిల్ రియల్ హీరోగా మారాడు. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం కార్తికేయ. అందులో హీరో.. మూసిఉన్న గుడి రహస్యం తెలుసుకొని.. చివరికి ఆ గుడిని తెరిపిస్తాడు. ఇప్పుడు నిఖిల్ అదే సీన్ ను బయట కూడా రీపీట్ చేశాడు.

అసలు విషయం ఏంటంటే.. ఏపీలోని చీరాలలో ఒక మూసి ఉన్న ఆలయాన్ని నిఖిల్ తెరిపించాడు. ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆ ఆలయాన్ని మూసేశారు. ఇక తాజాగా ఆ విషయం తెలుసుకున్న నిఖిల్ ఆల‌యాన్ని తెరిపించడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీంతో గ్రామ ప్రజలు నిఖిల్ కు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించారు. నిఖిల్ నడుస్తుండగా.. ఆయన పాదాలకు పూలు వేసి లోపలి ఆహ్వానించారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోను నిఖిల్ షేర్ చేస్తూ.. “గ్రామం మొత్తానికి శిక్షగా ఈ ఆలయాన్ని మూసివేశారు.. గత నెలలో దీనిని తెరిచాము… మా కుటుంబానికి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు…అభివృద్ధి అందరికీ చేరేలా కృషి చేస్తాం” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈసారి ఎన్నికల్లో నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బాప‌ట్ల జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ఎం కొండ‌య్యకు మ‌ద్ద‌తుగా నిఖిల్ ప్రచారం చేశాడు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచాడు. చీరాలలో అభివృద్ధి మును ముందు ఇంకా చూస్తారని నిఖిల్ ఇచ్చిన హామీని ఇలా నిలబెట్టుకున్నాడు. ఇకపొతేహ్ ప్రస్తుతం ఈ కుర్ర హీరో స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×