E-Paper
Advertisement

Niti Taylor: మరో స్టార్ హీరోయిన్ విడాకులు.. ?

Niti Taylor: మరో స్టార్ హీరోయిన్ విడాకులు.. ?
Advertisement

Niti Taylor: ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. సినిమా, సీరియల్ నటులు అని తేడా లేకుండా తమ భాగస్వాములతో విడాకులు ప్రకటిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు నీతి టేలర్.

మేము వయస్సుకు వచ్చాం సినిమా గుర్తుందా.. ? తనీష్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా నీతి తెలుగుతెరకు పరిచయమైంది. ఇందులోని ‘వెళ్లిపోవే వెళ్లిపోవే’ అనే పాట అప్పట్లో మంచి పాపులర్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు కూడా బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ ఫస్ట్ ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందేమో అనుకున్నారు. కానీ, తెలుగులో రెండు,మూడు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యింది.

Advertisement

పెళ్లి పుస్తకం, లవ్ డాట్. కామ్ లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేకపోయాయి. ఇక టెలివిజన్‌ స్టార్‌గా మారి టీవీ షోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ నటించింది. ఎంటీవీ ఇండియా కైసీ యే యారియాన్‌లో నందిని మూర్తిగా, గులామ్‌లో శివాని మాథుర్, ఇష్క్‌బాజ్‌లో మన్నత్ కౌర్ ఖురానా పాత్రలో ఆమె ప్రసిద్ధి చెందింది.

ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పరీక్షిత్ బావా అనే ఆర్మీ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నీతి.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంది. అయితే తాజాగా నీతి విడాకుల బాట పట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పేరు వెనుక ఉన్న భర్త పేరును తొలగించడమే కాకుండా.. భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో నీతి విడాకులు తీసుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×