E-Paper
Advertisement

Nivetha Thomas Birthday : ఈ కేరళ కుట్టికి టాలెంట్ ఉన్నా.. పాపం అదృష్టం కలిసిరాలేదా..?

Nivetha Thomas Birthday : ఈ కేరళ కుట్టికి టాలెంట్ ఉన్నా.. పాపం అదృష్టం కలిసిరాలేదా..?
Advertisement

Nivetha Thomas Birthday : తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు హీరోయిన్లు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి బాగా సెటిల్ అయిపోయిన వారే. అలా తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చే హీరోయిన్లలో మలయాళం బ్యూటీ నివేతా థామస్ ఒకరు. నాచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ కేరళ కుట్టి పరిచయం అయింది. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాలు వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ఈ బ్యూటీ నవంబర్ 2, 1995లో కేరళలోని కన్నూర్ లో జన్మించింది. అంటే ఈ నవంబర్ 2కి అచ్చంగా ఈ బ్యూటీ కి 28 సంవత్సరాలు. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ లో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తూ ఉంటుంది. అయితే గత కొద్ది కాలంగా ఎందుకో నివేతా సినిమాల గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు.

Advertisement

నివేతా తన సినీ కెరియర్ ను మలయాళం మూవీ ఉత్తరలో ఒక బాల నటిగా ప్రారంభించింది. సన్ టీవీలో ప్రసారమయ్యే మై డియర్ బూతం అనే చిన్న పిల్లల షోలో కూడా నటించింది. తర్వాత చాలా తమిళ్, మలయాళ మూవీస్ లో సహాయ నటిగా నటిస్తూ క్రమంగా హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తెలుగులో జెంటిల్మెన్ , నిన్ను కోరి, జై లవకుశ లాంటి మంచి హిట్ చిత్రాల్లో నటించింది.

దర్బార్ మూవీలో రజనీకాంత్ కూతురుగా నటించి తన యాక్షన్ తో అందరి మనసులు దోచుకుంది నివేతా. ఆ తర్వాత క్రమంగా ఆమెకు మూవీ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్ర పోషించింది. రెజీనా కాసాండ్రా తో కలిసి శాకినీ డాకినీ అనే హారర్ కామెడీ చిత్రంలో నివేతా నటన వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ మూవీ తర్వాత తిరిగి నివేతా సినిమాలపై ఎటువంటి అప్డేట్స్ లేవు. మరోపక్క ఆమె నుంచి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఈ బ్యూటిఫుల్ కేరళ కుట్టి బర్త్ డే సందర్భంగా బిగ్ టివి తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×