E-Paper
Advertisement

Ntr : ఆ ఐదుగురు డైరెక్టర్స్ కు లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది నీకే సాధ్యం భయ్యా..

Ntr : ఆ ఐదుగురు డైరెక్టర్స్ కు లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది నీకే సాధ్యం భయ్యా..

Ntr : సినీ ఇండస్ట్రీలో ప్లాఫ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి ముందుకు రారు. ఇక ఆ డైరెక్టర్స్ ఎంత మంచి కథతో వచ్చిన ఇంట్రెస్ట్ చూపించరు. గతంలో ఎన్నో బ్లేడక్ బాస్టర్ సినిమాలు చేసిన కూడా ఒక్క ఫ్లాప్ పడితే స్టార్ హీరోలు ఆ డైరెక్టర్స్ ను పక్కన పెడతారు. ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమా అంటే ఒకింత రిస్క్ అని భావిస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగేది ఇదే.. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. ఆ డైరెక్టర్ లో ఏదో విషయం ఉంది ఫ్లాప్ అయిన పర్వాలేదు సినిమాను తీస్తాను అని ముందుకు వస్తారు. అందరు హీరోలు పక్కన పెట్టినా కూడా ఎన్టీఆర్ ఆ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. గత పదేళ్లలో ఐదుగురు డైరెక్టర్స్ లైఫ్ ఇచ్చాడు. ఇక ఆ ఐదుగురు డైరెక్టర్లు ఎఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

పూరి జగన్నాథ్..

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో పెద్ద హిట్ సినిమాలు లేవు. ఆయన ఖాతాలో ఇప్పటికి ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. పూరి జగన్నాథ్ మీద నమ్మకంతో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేశాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పూరికి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా ఇదే.. అంతేకాదు బాక్సాఫీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది..

సుకుమార్..

డైరెక్టర్ సుకుమార్ ఒకప్పుడు 1 నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొత్త సినిమా కోసం కథ రాసుకొని హీరోల చుట్టు తిరిగిన ఎవరు అయన సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరగా ఎన్టీఆర్ కథను వినిపించాడు. సుక్కును నమ్మి ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాతో తారక్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ ను అందుకుంది. సుకుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ లో మళ్లీ బిజీ అయ్యారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో వరుస హిట్ సినిమాలను అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బాబీ..

డైరెక్టర్ బాబీ గురించి అందరికీ తెలుసు.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. అతన్ని నమ్మి ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్..

పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ తో సినిమాలు చెయ్యడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆయనతో సినిమా చెయ్యడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబోలో అరవింద సమేత సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.

కొరటాల శివ..

ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈయనకు ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పుడు మరో హీరోతో సినిమా చెయ్యనున్నాడు..

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వార్ 2 సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా ప్రశాంత్ నీల్ తోనూ, అలాగే త్రివిక్రమ్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×