BigTV English

NTR30 as a full action movie : ఫుల్‌ యాక్షన్‌ మూవీగా ఎన్టీఆర్‌

NTR30 as a full action movie : ఫుల్‌ యాక్షన్‌ మూవీగా ఎన్టీఆర్‌

NTR30 as a full action movie : ఎన్నాళ్లుగానో ఆకలి మీదున్న ఫ్యాన్స్ కి కరువు తీరిపోయే అప్‌డేట్‌ ఇచ్చేశారు ఎన్టీఆర్‌. న్యూ ఇయర్‌ రోజు నందమూరి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎప్పుడెప్పుడు బాస్‌ అని ఎదురుచూస్తున్న అభిమానులకు పరమాన్నం పెట్టేశారు తారక్‌.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనిరుద్‌ ఆల్రెడీ ట్యూన్ల కంపోజింగ్‌ మొదలుపెట్టేశారు.ధైర్యం రోగమైతే, భయం ఒక్కటే దానికి మందు అనే క్యాప్షన్‌ ఇచ్చారు నిర్మాతలు.


యువ సుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. రత్నవేలు కెమెరాను నిర్వహిస్తున్నారు. సాబు సిరిల్‌, శ్రీకర్‌ ప్రసాద్‌ కీ టెక్నీషియన్లు. మ్యాన్‌ ఆఫ్‌ ది మాసెస్‌ అంటూ ఈ మూవీ గురించి పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. అంతే కాదు, తారక్‌ రెండు చేతుల్లోనూ కత్తులున్నాయి. ఆయుధాలను బట్టి చూస్తుంటే పక్కా యాక్షన్‌ సినిమా అనే విషయం కన్‌ఫర్మ్ అయింది.
జగతా గ్యారేజ్‌ తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రమిది. ఈ సారి యాక్షన్‌ ఇంకో రేంజ్‌లో ఉంటుందనే హింట్స్ అందుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీతో ఫారిన్‌లో స్పెండ్‌ చేస్తున్నారు తారక్‌. తిరిగి రాగానే కొరటాల మూవీ కోసం మేకోవర్‌ మొదలుపెడతారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత తారక్‌ నటిస్తున్న సినిమా ఇదే.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×