E-Paper
Advertisement

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ
Advertisement

OG : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించింది. తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద కూర్చొని పెట్టిన సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమాను నిర్మించింది డివివి దానయ్య. ఈ సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్యానర్ కూడా మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఈ బ్యానర్ లో రీసెంట్ గా సరిపోదా శనివారం అనే సినిమా వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సాధించి మంచి లాభాలను కూడా తీసుకొచ్చింది. ఇక ఈ బ్యానర్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓ జి. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమా పడితే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుంది. జానీ సినిమా తర్వాత దాదాపు ఒక 10 ఏళ్లు పట్టు హిట్ సినిమా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ మార్కెట్ రెండు పెరుగుతూనే వెళ్లాయి అది పవన్ కళ్యాణ్ రేంజ్. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేశాడు పవన్ కళ్యాణ్. ఒక రీమేక్ సినిమా అయినా కూడా దానిని హరీష్ డీల్ చేసిన విధానం. పవన్ కళ్యాణ్ స్వాగ్ ఆటిట్యూడ్ ఇవన్నీ కలిసి వచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనేదానికి నిదర్శనం గబ్బర్ సింగ్ సినిమా. ఇప్పుడు ఇంకో పవన్ కళ్యాణ్ అభిమాని సుజిత్ చేస్తున్నాడు ఓ జి.

Advertisement

గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు సుజిత్ థియేటర్ నుంచి అరుచుకుంటూ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఓజి సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ అయిన గ్లిమ్స్ లో ఎస్ ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన ప్రతి సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఓజి సినిమా కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వబోతున్నాడని చాలామంది ఊహిస్తున్నారు.

వాస్తవానికి అన్నిటికంటే ముందు ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయ పనులు వలన ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ దాదాపు 15 రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించిన డేట్స్ ఇచ్చేశాడు ప్రస్తుతం షెడ్ లో జాయిన్ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఈ విషయం ప్రొడ్యూసర్ దానయ్యకు విముక్తిని కలిగిస్తే, చాలామంది అభిమానులకు సంతోషం కలిగిస్తుంది అని చెప్పాలి. ఏదేమైనా ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే అదే చాలు అనేది చాలామంది అభిప్రాయం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×