E-Paper
Advertisement

OTT: ఓటీటీలో ఈవారం సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

OTT: ఓటీటీలో ఈవారం సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Advertisement

OTT: సినీ ప్రియులకు పండుగే.. పండుగ. ఈ వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ అవుతున్నాయి.. సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ, కల్యాణం కమనీయం, సుధీర్ నటించిన గాలోడు, మాలికాపురం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించనున్నాయి.

కల్యాణం కమనీయం

Advertisement

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ కళ్యాణం కమనీయం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. ఆహాలో ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

గాలోడు

Advertisement

బుల్లితెర స్టార్ సుధీర్ నటించిన సినిమా గాలోడు. పోయిన ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ఆహాలో ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.

లక్మీ లక్ష్మణ్

బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ లేటెస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్. మోక్ష హీరోయిన్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ కూడా ఆహాలో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సర్కస్

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సినిమా సర్కస్. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే, జాక్విలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో బోల్తా పడ్డ ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 17న అందుబాటులోకి రానుంది.

మాలికాపురం

ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో అయ్యప్పస్వామి, బాలధారణ ఇతివృత్తంగా రూపొందిని సినిమా మాలికాపురం. ఈ మూవీ ఫిబ్రవరి 15 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది.

వెబ్‌సిరీస్‌లు

కార్నివల్ రో – అమెజాన్ ప్రైమ్ వీడియోస్-ఫిబ్రవరి 15
ఆఫ్రికన్ క్వీన్స్: జింగా-నెట్‌ఫ్లిక్స్-ఫిబ్రవరి 15
గ్యాంగ్‌లాండ్స్-నెట్‌ఫ్లిక్స్-ఫిబ్రవరి 17
అన్‌లాక్-నెట్‌ఫ్లిక్స్-ఫిబ్రవరి 17
పుల్ స్వింగ్–నెట్‌ఫ్లిక్స్-ఫిబ్రవరి 15
రెడ్ రోజ్-నెట్‌ఫ్లిక్స్-ఫిబ్రవరి 15
లవ్ ఆన్ ది రాక్-లయన్స్‌గేట్ ప్లే-ఫిబ్రవరి 17

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×