E-Paper
Advertisement

BRO Movie Updates : సెంచరీ కొట్టిన ‘బ్రో’.. థియేట్రికల్ బిజినెస్ అదిరిందిగా..!

BRO Movie Updates : సెంచరీ కొట్టిన ‘బ్రో’.. థియేట్రికల్ బిజినెస్ అదిరిందిగా..!
Advertisement
BRO Movie Updates

BRO Movie Updates : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా న‌టించిన చిత్రం ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. జూలై 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇద్ద‌రు మెగా క్యాంప్ హీరోలు క‌లిసి న‌టించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. వీటికి త‌గ్గ‌ట్లు రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెక్ట్స్‌ రేంజ్‌కు చేరుకున్నాయి.

Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ట్రేడ్ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా బ్రో’ సినిమా విష‌యంలో ఆ విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రూ.100 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. ఆంధ్ర ఏరియాలో రూ.40 కోట్లు.. నైజామ్‌లో రూ.30 కోట్లు.. సీడెడ్‌లో రూ.13 కోట్లు.. ఓవ‌ర్ సీస్‌లో రూ.13 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. అన్ని క‌లిపి రూ.96 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఇంకా క‌ర్ణాట‌క ఏరియాలో బిజినెస్ జ‌ర‌గాల్సి ఉంది. మినిమం రూ.4 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్‌ను దాటినా కూడా బ్రో’ సినిమా రూ.100 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ పూర్తి చేసుకున్న‌ట్టు.

మ‌రి బ్రో’ మూవీ ఆయా ఏరియాల్లో ఏ మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటుంద‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. త‌మిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కు ఇది రీమేక్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గిన‌ట్లు ఈ సినిమాను పూర్తిగా మార్చేశారు. రీసెంట్‌గా రిలీజైన టీజ‌ర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చాలా త్వరగా పూర్తి చేసేయటం విశేషం. ఇప్పుడాయన సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న OG, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×