E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: మూవీ ఓపెనింగ్‌కి ఆర్మీ క‌ల‌ర్ డ్రెస్‌లో ప‌వ‌న్‌.. వాళ్ల‌కి కౌంట‌ర్ ఇవ్వ‌డానికేనా!

Ustaad Bhagat Singh: మూవీ ఓపెనింగ్‌కి ఆర్మీ క‌ల‌ర్ డ్రెస్‌లో ప‌వ‌న్‌.. వాళ్ల‌కి కౌంట‌ర్ ఇవ్వ‌డానికేనా!

Ustaad Bhagat Singh:ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి నిర్మిస్తున్న ఈ మూవీ ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమా ఈవెంట్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్మీ వాళ్లు వేసుకునే డ్రెస్ వేసుకుని రావ‌టం అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌న్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌చారం కోసం వారాహి అనే వాహ‌నాన్ని త‌యారు చేసుకున్నారు. దీనిపై ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్ వేసుకున్నారు.

దీనిపై వైసీపీ నాయ‌కులు, ఇత‌రులు కొంద‌రు అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. ఆర్మీ వాళ్లు ఉప‌యోగించే ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా ఉప‌యోగిస్తారంటూ కామెంట్స్ చేశారు.ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సైతం ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీ నాయ‌కుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈరోజు ఫ‌లానా ప‌ని చేయ‌కండ‌ని అంటున్నారు. మ‌రి శ్వాస తీసుకోవ‌చ్చా అని అడిగారు. అలాగే ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్ ష‌ర్ట్ చూపించి దాన్ని వేసుకోవ‌చ్చా? అని కూడా అడిగారు.

ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా ప్రారంభానికి ప‌వ‌న్ ఆలివ్ గ్రీన్ క‌ల‌ర్ ష‌ర్ట్‌నే వేసుకుని వ‌చ్చారు. వైసీపీ నాయ‌కుల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌టానికే ప‌వ‌న్ అలా చేశార‌ని కొంద‌రు అంటున్నారు. త‌మిళ చిత్రం తెరికి రీమేక్‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా రూపొందుతుంద‌ని టాక్ బ‌లంగా వినిపిస్తుంది. కానీ.. చిత్ర యూనిట్ మాత్రం ఏమీ స్పందించ‌లేదు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×