E-Paper
Advertisement

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది
Advertisement

TheyCallHimOG: దేవర.. మరి కొన్ని గంటల్లో  థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. కానీ, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా బాధలో ఉన్నారు. అయ్యో.. దేవర రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ ఎందుకు  బాధపడుతున్నారు అనేగా అనుమానం. మరి.. బాధపడకుండా ఎలా ఉంటారు. అన్ని బావుండి ఉంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లేస్ లో పవన్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు.   ఇంకా అర్ధం కాలేదా.. ? సెప్టెంబర్ 27 డేట్ ను మొదట ఫిక్స్ చేసింది OG .

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ ఎన్నికల ముందే ఈ సినిమాను ఫినిష్ చేయాలనీ చూశాడు. మిగతా రెండు సినిమాలను కూడా పక్కన పెట్టి.. OG మీదనే ఫోకస్ చేశాడు. అందుకే సగానికి పైగా షూటింగ్ ను ఫినిష్ చేయగలిగాడు.

Advertisement

ఇక ఆ సమయంలోనే సెప్టెంబర్  27 న రిలీజ్ కోసం మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కానీ , ఈలోపు చాలా జరిగిపోయాయి. పవన్ ఎన్నికల్లో  గెలిచాడు.. ఏపీ డిప్యూటీ సీఎం గా మారాడు.   దీంతో షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. ఇక అదే అదునుగా భావించిన దేవర చిత్ర బృందం.. OG రిలీజ్ డేట్ ను కబ్జా చేసింది. లేకపోతే.. దేవర వచ్చే నెలలో రిలీజ్  కావాల్సి ఉండేది.

ఇవన్నీ మారకుండా అనుకున్నట్లు జరిగి ఉంటే.. దేవర.. దేవర  అని కాకుండా ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ హిట్ కొట్టాడు .. అనే డైలాగ్స్ వినిపించేవి.  పవన్ కమ్ బ్యాక్ అదిరిందని సోషల్ మీడియా షేక్ అయ్యేలా సందడి చేసేవారు.  ఇప్పుడు OG ఎప్పుడు  వస్తుందో అని ఎదురుచూస్తూ కూర్చోవడం పవన్ ఫ్యాన్స్ వంతు అయ్యింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ? ఆ డైలాగ్స్  ఎప్పుడు నిజం అవుతాయి అనేది దేవుడికే తెలియాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×