E-Paper
Advertisement

Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. మళ్లీ మొదలయ్యేది ఎప్పుడు.. ?

Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. మళ్లీ మొదలయ్యేది ఎప్పుడు.. ?
Advertisement

Harihara Veeramallu: ప్రస్తుతం ఏపీ మొత్తం హీటెక్కిపోయి ఉంది. మరో మూడు రోజుల్లో ఏపీ ప్రజల భవిష్యత్ ఎవరి చేతులో ఉండబోతుందో తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రాజకీయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అందరూ.. ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

పార్టీ ఫండ్ కోసమని సినిమాలు చేస్తున్న పవన్.. ఎలక్షన్స్ కోసం నిర్మాతలు వద్ద డబ్బులు తీసుకొని ప్రచారం ముగించాడు. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఫినిష్ చేయాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇక ఈ మూడింటిలో హరిహర వీరమల్లు ఎప్పటినుంచో పవన్ కోసం ఎదురుచూస్తుంది.

Advertisement

కొన్నేళ్లుగా ఈ సినిమా షూట్ జరుగుతూనే ఉంది. కానీ, పవన్ రాజకీయాలలో బిజీగా ఉంటూ దాన్ని పక్కన పెడుతూ వస్తున్నాడు. ఇక నిర్మాత ఎఎం రత్నం మాత్రం పవన్ ఎప్పుడు వస్తే అప్పుడే షూటింగ్ అని చెప్పి ఎదురుచూస్తున్నాడు. ఇక ఎట్టకేలకు ఆ ఎదురుచూపులు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. అసలు గత కొన్నిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకూండా ఉన్నారు.

డైరెక్టర్ క్రిష్.. సినిమా నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో జ్యోతికృష్ణ వచ్చాడు. ఒక్క సినిమా తీసిన అనుభవంతో ఇంత పెద్ద సినిమా ఎలా తీయ్యగలడు అనే అనుమానం ప్రేక్షకులలో మొదలయ్యింది. సరే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యింది.. చివరన కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.. అవి మాత్రమే అతను డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. ఇక ఎప్పుడు పవన్.. ఈ సెట్ లో అడుగుపెడతాడు అన్నదానికి ఎట్టకేలకు ఒక సమాధానం వచ్చింది.

Advertisement

జూన్ 4 న ఎన్నికల ఫలితాల తరువాత హరి హర వీరమల్లులో పవన్ అడుగుపెట్టనున్నట్లు ఏఎం రత్నం అధికారికంగా తెలిపాడు. ఈ సినిమాను ఫినిష్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో కూడా  పవన్ ఈ సినిమాలు చేస్తాడా.. ? చేయడా.. ? అనేది కూడా రిజల్ట్స్ నిర్ణయిస్తాయి అని తెలుస్తోంది. మరి ఫలితాల తరువాత హీరో పవన్ అవుతాడా.. ? సీఎం పవన్ అవుతాడా.. ? అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×