E-Paper
Advertisement

Poonam Kaur: అల్లు అర్జున్ కు పూనమ్ సపోర్ట్.. ఆ ఫోటో షేర్ చేస్తూ..

Poonam Kaur: అల్లు అర్జున్ కు పూనమ్ సపోర్ట్.. ఆ ఫోటో షేర్ చేస్తూ..
Advertisement

Poonam Kaur: మెగా- అల్లు కుటుంబాల విభేదాలు.. ఇప్పుడు  పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్  వార్ లా  మారిపోయాయి. అసలు కథ మొదలయ్యిందే పవన్ జనసేన ప్రచారం దగ్గరనుంచి కాబట్టి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్.. పవన్ ఫై ట్రోలింగ్ చేస్తూనే వస్తున్నారు. మొదటినుంచి అల్లు అర్జున్.. తన ఆధిపత్యాన్ని అందుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని చూపిస్తున్నాడు.

అసలు  మెగా ఫ్యామిలీ అనేది లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడా.. అల్లు ఫ్యాన్స్ లో ఉన్నవారందరూ  మెగా ఫ్యాన్స్ మాత్రమే అని  మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బన్నీ చేసినదాంట్లో తప్పేమి ఉంది. స్నేహితుడు కోసం ప్రచారానికి వెళ్లడం తప్పు కాదు..  తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఎదుగుతుంటే.. మెగా  ఫ్యామిలీ తొక్కేయాలని చూస్తోంది. అందుకే అతనిపై ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అల్లు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్దమో అనేది  అల్లు అర్జున్ కు మాత్రమే  తెలియాలి.

Advertisement

ఇక ఈ వివాదం చిలికి కలికి గాలివానలా మారి.. ఫ్యాన్స్ ట్రోలింగ్ నుంచి రాజకీయంగా మారింది. నిన్నటికి నిన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగివా.. నీకసలు ఫ్యాన్స్ ఉన్నారా.. ?  మెగా హీరోలలో నిన్ను చూసుకోవడం వలన వారి ఫ్యాన్స్ నీకు ఫ్యాన్స్ అయ్యారు. నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. నా మనసుకు నచ్చితేనే వస్తా.. అంటే రాకు. ఎవరు రమ్మన్నారు..  అంటూ నోరు జారాడు. దీంతో ఈ వివాదం మరింత  చిక్కుముడిగా మారింది.

తాజాగా అల్లు అర్జున్ కు  నటి పూనమ్ కౌర్ మద్దతు పలికింది. అల్లు అర్జున్, స్నేహ  రెడ్డితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ” లవ్, ప్రేయర్స్ అండ్ హార్మొనీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏది వచ్చినా దానికి సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది పూనమ్ . దానికి కారణం.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి పూనమ్ కెరీర్ ను నాశనం చేశారని  ఆమె ఆరోపించిన విషయం తెల్సిందే.  ఇక ఈ పోస్ట్ కు అల్లు ఫ్యాన్స్   తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.  మరి ఈ వార్ కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×