E-Paper
Advertisement

Prabhash: ప్రభాస్ కి నచ్చని తారక్ మూవీ ఏంటో తెలుసా..?

Prabhash: ప్రభాస్ కి నచ్చని తారక్ మూవీ ఏంటో తెలుసా..?
Advertisement

Prabhash.. రెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhash)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా కల్కి 2898AD సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

ప్రభాస్ – ఎన్టీఆర్ మధ్య గొడవలు నిజమేనా..

Advertisement

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో సఖ్యతగా ఉండే ప్రభాస్ కి.. ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. ఆయనతో కలిసి పనిచేయాలని కూడా ప్రభాస్ ఆరాటపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ప్రభాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ కి , తారక్ కి మధ్య సఖ్యత లేదని, ఒక దర్శకుడు వల్ల విభేదాలు ఉన్నాయనే వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.

ఇవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే..

Advertisement

అయితే ఈ వార్తలు వినిపించిన ఆరు నెలల తర్వాత ఒక సినిమా ఫంక్షన్లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడగా అసలు విషయం తెలుసుకొని , సమస్యను సాల్వ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాని కూడా ప్రభాస్ చేసి పర్సనల్ గా కంగ్రాట్స్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు పూర్తిగా తెగిపోయాయని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ కి నచ్చని తారక్ మూవీ..

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా ప్రభాస్ కి నచ్చలేదట. ఈ విషయాన్ని స్టేజిపై ప్రభాస్ స్వయంగా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ తన కెరియర్లో ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు చేసి ఆ తర్వాత వర్షం సినిమా చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కూడా విడుదలైందట. ఒక సందర్భంలో బహిరంగంగా వేదికపై తనకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నచ్చలేదని చెప్పేసారట ప్రభాస్.

సారీ చెప్పిన ప్రభాస్..

ఇదే విషయంపై ప్రభాస్ మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నచ్చలేదు. తారక్ సారీ ఏమీ అనుకోకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కానీ ఈ చిత్రం నాకు మాత్రం ఎందుకో నచ్చలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా చేశాడు కదా.. ఆ తర్వాత ఒకరోజు నన్ను పిలిచి ఈ సినిమా ప్రివ్యూ చూడాలంటూ తీసుకెళ్లి చూపించాడు. ఇక ఆ సినిమా చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మెంటల్ వచ్చేసింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది. భవిష్యత్తులో ఇతడితో నేను అసలు సినిమానే చేయలేను అన్నాను. కానీ ఆయనతోనే వరుసగా సినిమాలు చేశాను అంటూ ఒక వేదికగా ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ చెప్పిన మాటలను ఎన్టీఆర్ స్పోర్టివ్ గా తీసుకొని ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×