E-Paper
Advertisement

Prakash Raj: పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. అందులో ఆనందం ఏంటో అని మళ్లీ సెటైర్..

Prakash Raj: పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. అందులో ఆనందం ఏంటో అని మళ్లీ సెటైర్..
Advertisement

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం  ఏమో కానీ, ఏపీ డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు  రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరు వదిలినా వదలకపోయినా.. నటుడు ప్రకాష్  రాజ్ మాత్రం.. పవన్ కళ్యాణ్ ను వదిలేలా  కనిపించడం లేదు. గత మూడు రోజులుగా ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తూనే  ఉన్నాడు.

తిరుపతి లడ్డూ వివాదంపై మొదటిసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. ” డియర్ పవన్ కళ్యాణ్… మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది.. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారు… ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడిన  దాంట్లో కొద్దిగా వెటకారం ఉన్న మాట వాస్తవమే కానీ, ఈ వివాదానికి మతపరమైన రంగు పులమొద్దని, నేషనల్ వైడ్ గా ఈ వివాదాన్ని రెచ్చగొట్టొద్దని చెప్పాడు. దానిని  పవన్ కళ్యాణ్ తప్పుగా అర్ధం చేసుకొని.. ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు.  “ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా తెలియజేస్తున్నాను. దీని మీద మీరు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి. లేదంటే మౌనంగా ఉండండి. మీమీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరు” అని తెలుపడంతో..  ప్రకాష్ రాజ్  మరోసారి రియాక్ట్ అయ్యాడు.. ” శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. నేను చెప్పిందేంటి.. మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి. నేను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను 30 తరువాత వస్తాను. వచ్చాక మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఈ మధ్యలో మీకు వీలైతే మరోసారి ఆ ట్వీట్ ను చదవండి.. అర్ధం చేసుకోండి.. ప్లీజ్” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. కార్తీ చేత  క్షమాపణలు చెప్పించుకోవడంపై సోషల్ మీడియాలో నెగెటివిటి బాగా పెరిగింది. కార్తీ చేయని తప్పుకు పవన్ సారీ చెప్పించాడని అందరు రచ్చ చేస్తున్నారు.. ఈవెంట్ లో లడ్డూ గురించి అడిగింది యాంకర్. ఆయన చాలా క్యాజువల్ గా ఇది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి వదిలేశారు. ఇక కార్తీ మాటలకు కూడా పవన్ చాలా సీరియస్ అయ్యి.. సనాతన ధర్మాన్ని  అపహాస్యం చేయొద్దని తెలిపారు. దీనికి కార్తీ కూడా సారీ చెప్పాడు.

Advertisement

ఇక  ఏ తప్పు  చేయకపోయినా కార్తీ సారీ చెప్పి తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ వివాదంపై  ప్రకాష్ రాజ్ మళ్లీ సెటైర్ వేశాడు. ” చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్” అంటూ  ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ  పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×