BigTV English

Prakash Raj: మనకు ఏం కావాలి? ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ – మోనార్క్ దాటికి పవన్ తట్టుకోగలరా?

Prakash Raj: మనకు ఏం కావాలి? ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ – మోనార్క్ దాటికి పవన్ తట్టుకోగలరా?

Prakash Raj.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj).. సాధారణంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూ కల్తీ అయ్యింది అంటూ సెప్టెంబర్ 18వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది.


జగన్ ప్రభుత్వంలోనే లడ్డూ కల్తీ..

అయితే ఇది జగన్ ప్రభుత్వంలోనే ఇలా కల్తీ అయ్యిందని, ముఖ్యంగా జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవుళ్ళ పైన ఆయనకు గౌరవం లేదు అనే రీతిలో టిడిపి ప్రభుత్వం కామెంట్లు చేసింది. అంతే కాదు తాజాగా తిరుమలలో దీక్ష చేపట్టాలనుకున్న జగన్ కి వ్యతిరేకత ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జగన్ తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని పురందేశ్వరి ఇప్పటికే కోరింది. దీంతో పలు రకాల వార్తలు సంచలనంగా మారాయి. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అంటూ గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు


పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు

అసలు విషయంలోకి వెళ్తే.. మా ఎలక్షన్స్ సమయంలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ప్రకాష్ రాజ్ విరుచుకుపడుతూ .. సమాజం మేలు కోసం చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. లడ్డు కల్తీ జరిగిందనే వార్త బయటకు వచ్చినప్పుడు మత కొల్లాలాలు సృష్టించొద్దు.. జాతీయస్థాయిలో ప్రచారం చేయవద్దు అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు. మరొకవైపు కార్తీ సరదాగా చేసిన కామెంట్ కి పవన్ కళ్యాణ్ కోపం వ్యక్తం చేయడంతో కార్తీ పవన్ కు క్షమాపణలు చెప్పారు. దీంతో మళ్లీ ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్ ..చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో కలిగే ఆనందమేంటో అంటూ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ వేశారు.

ప్రాయశ్చిత్త దీక్షపై ప్రకాష్ రాజ్ కౌంటర్..

ఇక నిన్నటికి నిన్న..” గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం..? ఎందుకు మనకీ అయోమయం.. ?ఏది నిజం ? అంటూ గురువారం ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే ఇది కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే కావడం గమనార్హం. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారి గురించి స్పందించిన విషయంపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ ఇలాంటి పోస్ట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ .

మరో ట్వీట్ తో రెచ్చగొట్టిన ప్రకాష్ రాజ్..

ఇప్పుడు మరొకసారి మరో ట్వీట్ వేస్తూ ఆశ్చర్యపరిచారు.”మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలన సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్.

ప్రకాష్ రాజ్ దాటికి పవన్ తట్టుకుంటారా..?

మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న ప్రకాష్ రాజ్ ను చూసి.. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ ప్రకాష్ రాజ్ గతంలో సుస్వాగతం సినిమాలో డైలాగ్ ను మళ్లీ నెటిజెన్స్ గుర్తు చేస్తున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ వేసే ప్రతి ట్వీట్ కూడా ఆలోచింప దిగినదే. మరి ప్రకాష్ రాజ్ దాటికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×