E-Paper
Advertisement

Prakash Raj: పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే..?

Prakash Raj: పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే..?
Advertisement

Prakash Raj:ప్రముఖ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీ.ఎమ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు అని ఆయన హితవు పలికారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా..” మీ హిందీ భాషను మా వద్ద మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని.. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ” అంటూ దండం పెడుతున్న ఏమోజీ తో కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అసలేమైందంటే..

Advertisement

అసలేమైంది అనే విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇలా భగ్గుమన్నాయని చెప్పవచ్చు. నాడు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ..” మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నాను అంటారు. అన్నీ దేశ భాషలే కదా .. తమిళనాడులో హిందీ రాకూడదని అంటుంటే, నాకు ఒకటే అనిపించింది. తమిళ్ సినిమాలు మరి హిందీలో డబ్బింగ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, బీహార్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తాము అంటే ఎలా? ఇదెక్కడి న్యాయం.. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్షత అనుభవించాను. గోల్టీ, గోల్టీ అని నన్ను చాలామంది అవమానించారు కూడా..” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

ముదురుతున్న జాతీయ వివాదం..

Advertisement

ఇదిలా ఉండగా ఇంకొక వైపు విద్యా విధానంపై అటు తమిళనాడు, ఇటు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి గుర్తును తొలగించి ఆస్థానంలో ” రూ” మాత్రమే వచ్చేలా అక్షరాన్ని చేర్చడం జరిగింది. దీంతో తమిళ్, హిందీ భాషల మధ్య వివాదం మరింత ముదిరినట్టు అనిపించింది. ఇకపోతే మాతృభాషను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యగా తమిళ సంఘాలు కూడా అభివర్ణించాయి. కానీ మరి కొంతమంది జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా వివాదం రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడంపై డిఎంకె కూడా వ్యతిరేకిస్తూ కామెంట్ చేయగా.. సీఎం స్టాలిన్ కూడా దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు విద్యార్థులు ఎందుకు మూడో భాషను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో మాకు చెప్పండి. ఆ తర్వాతే మేము ఆలోచిస్తాము. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధించి, ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం. అయినా ఇక్కడ విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?” అంటూ కూడా ఆయన ప్రశ్నించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×