BigTV English

NTR31: నీల్ మావా ఫోకస్ అంతా డ్రాగన్ మీదనే.. ?

NTR31: నీల్ మావా ఫోకస్ అంతా డ్రాగన్ మీదనే.. ?

Jr NTR prashanth neel movie update(Today tollywood news): సలార్ తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. వరుస సినిమాలను ప్రకటించాడు. ఒకపక్క సలార్ 2 ఉండగా.. ఇంకోపక్క ఎన్టీఆర్ 31 ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్.. రాజాసాబ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే కల్కి 2 రాదు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఏ సినిమా మొదలుపెట్టాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


అంతేకాకుండా గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ 31 ను హోల్డ్ చేసి.. సలార్ 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం..ప్రశాంత్ నీల్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ 31 మీదనే ఉందట. ఇప్పుడప్పుడే సలార్ 2ను పట్టాలెక్కించే ప్రయత్నాలు కూడా చేయడం లేదని టాక్. దీంతో మొదట నీల్.. ఎన్టీఆర్ 31 నే మొదలుపెట్టనున్నాడని తెలిసిపోతుంది.

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ 31 ఒకటి. ప్రస్తుతం అందరి ఆశలు దేవర మీదనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఫినిష్ చేసి ఎన్టీఆర్, వార్ 2 లో అడుగుపెట్టనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఈ రెండింటిని ఒకసారి ఫినిష్ చేస్తున్నాడు. దానికి కారణం ఎన్టీఆర్ 31 కు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని, లుక్ మళ్లీ పోకూడదని ఆలోచనలో ఉన్నాడట.


ఇకపోతే నీల్.. ఎన్టీఆర్ 31 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి.. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ 3 టైటిల్ డ్రాగన్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. దేవర కనుక హిట్ అయితే.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×