BigTV English

‘Darling’ Movie Glimpse: భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ‘డార్లింగ్’.. గ్లింప్స్ రిలీజ్!

‘Darling’ Movie Glimpse: భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ‘డార్లింగ్’.. గ్లింప్స్ రిలీజ్!

‘Darling’ Movie Glimpse: ఈ మధ్య చిన్న హీరోల సినిమాలు ఎక్కువైపోయాయి. హీరో కమెడియన్లుగా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన నటులు సైతం హీరోగా సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇందులో సుహాస్, వైవా హర్ష వంటి నటులతో సహా ప్రియదర్శి కూడా ఒకడు.


కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ప్రియదర్శి అలా ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరికీ ఓ రోజు వస్తుందంటారు. అలాగే ప్రియదర్శికి కూడా ఓ రోజు వచ్చింది. అదే ‘బలగం’ రోజు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించి అందరినోటా మంచి మార్కులే కొట్టేశాడు.

ఆ సినిమా తర్వాత ఇటీవల ‘ఓం భీమ్ బుష్’ సినిమాలోనూ నటించి అదరగొట్టేశాడు. దీంతో అందరి చూపు అతడిపైనే పడింది. ఈ క్రమంలోనే అతడు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ‘డార్లింగ్’. ఇందులో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తుంది. అయితే ఈ మూవీ గురించే గత రెండు రోజులుగా ప్రియదర్శి, నభా నటేష్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.


Also Read: సోషల్ మీడియాలో డార్లింగ్ రచ్చ.. కొట్టుకుంటున్న హీరో హీరోయిన్లు!

ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ అందించారు. ఇందులో భాగంగా మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ గ్లింప్స్ చూస్తుంటే.. భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథలా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌తో ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సినిమా కోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×