BigTV English

Nabha Natesha – Priyadarshi Fight: సోషల్ మీడియాలో డార్లింగ్ రచ్చ.. కొట్టుకుంటున్న హీరో హీరోయిన్లు!

Nabha Natesha – Priyadarshi Fight: సోషల్ మీడియాలో డార్లింగ్ రచ్చ.. కొట్టుకుంటున్న హీరో హీరోయిన్లు!

Nabha Natesha – Priyadarshi ‘Darling’ Fight in Social Media: కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారాడు నటుడు ప్రియదర్శి. బలగం సినిమాతో భారీ హిట్ ను అందుకోవడంతో హీరోగా అతనికి మంచి కథలే పడుతున్నాయి. ఇక ఈమధ్య ఓం భీమ్ బుష్ కూడా హిట్ అందుకోవడంతో అందరి చూపు అతనిపైనే ఉంది. ఈ సినిమా తరువాత ప్రియదర్శి హీరోగా మంచి ఛాన్స్ పట్టేశాడు. లవ్ స్టోరీ కింగ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రియదర్శి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు.


ఇక రెండు రోజులుగా ప్రియదర్శి ప్రవర్తన సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. హీరోయిన్ నభా నటేష్ తో అతడు గొడవ పడడం ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. ఆమె పెట్టిన ఫోటోకు ప్రియదర్శి డార్లింగ్ అంటూ కామెంట్ చేయడంతో ఆమె సీరియస్ అయింది. లీగల్ గా అమ్మాయిలను డార్లింగ్ అంటే జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు తీర్పుకు సంబందించిన వార్తను ఆమె షేర్ చేస్తూ మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక ప్రియదర్శి మాత్రం ఎందుకు మేడం అంత కోపం అంటూ నభాను సమాధాన పరుస్తూనే వచ్చాడు. అయినా కూడా ఆమె తగ్గను కూడా తగ్గలేదు. ఈ గొడవ నిన్నటి నుంచి జరుగుతుంటే మధ్యలో ఇంకో హీరోయిన్ కూడా తీసుకొచ్చారు.


Also Read: Teja Sajja Mirai: తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాలో టాలీవుడ్ మాస్ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..!

Nabh natesh fights with Priyadarshi
Nabh natesh fights with Priyadarshi

తాజాగా రీతూ వర్మ ఫోటో కింద కూడా ప్రియదర్శి డార్లింగ్ అని సంబోధిస్తూ కామెంట్ చేయడంతో నభా మరింత రెచ్చిపోయింది. ప్రతిసారి ప్రతి హీరోయిన్ డార్లింగ్ అనడం ఏంటి .. నీకేమైనా మతిపోయిందా అంటూ ఫైర్ అయ్యింది. ఇక వీరిద్దరు ఇలా గొడవపడుతుంటే.. రీతూ వర్మ సైతం నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి అంటూ ఆమె కూడా సీరియస్ అయ్యింది. అసలు ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది..? ఎందుకు ప్రియదర్శి హీరోయిన్స్ ను డార్లింగ్ అంటూ కామెంట్ చేస్తున్నాడు అని ఆరా తీయగా ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే అని తెలుస్తుంది.

Also Read: Manamey Official Teaser: శర్వానంద్ ‘మనమే’ నుంచి టీజర్ రిలీజ్

ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటిస్తున్న సినిమాకు డార్లింగ్ అని టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం వాళ్లు ప్రమోషన్ మొదలుపెట్టినట్లు, అందుకే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పేరు అధికారికంగా ప్రకటించనున్నారు. అందుకే ఇప్పటి నుంచే వీళ్లు సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం గ్రహించిన కొంతమంది జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారులే అని కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే డార్లింగ్ అనే పేరుతో ప్రభాస్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరి ప్రభాస్ టైటిల్ తో వస్తున్న ఈ డార్లింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×