E-Paper
Advertisement

Darling Movie Trailer Released: నా పెళ్లాం బెల్లం రా.. ‘డార్లింగ్’ ట్రైలర్ కెవ్ కామెడీ

Darling Movie Trailer Released: నా పెళ్లాం బెల్లం రా.. ‘డార్లింగ్’ ట్రైలర్ కెవ్ కామెడీ
Advertisement

Darling Movie Trailer Released: టాలీవుడ్‌లో చిన్న నటులదే హవా కొనసాగుతోంది. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీసి మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందులో సుహాస్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ధన్‌రాజ్ వంటి నటులు ఉండగా నటుడు ప్రియదర్శి కూడా పలు సినిమాలతో అదరగొడుతున్నాడు. సినీ కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ తన యాక్టింగ్, కామెడీ పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రల్లో ఎక్కువగా నటించి అదరగొట్టేశాడు.

ఇక గతేడాది ‘బలగం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ వేణు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో హీరోగా ప్రియదర్శి, హీరోయిన్‌గా కావ్య కళ్యాణ్ రామ్ నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోగా ప్రియదర్శికి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రియదర్శి.

Advertisement

అతడు నటిస్తున్న కొత్త సినిమా ‘డార్లింగ్’. ఈ మూవీలో ప్రియదర్శికి జోడీగా నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ‘హనుమాన్’ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అదీగాక ఈ మూవీ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు ప్రియదర్శి అండ్ నభా నటేష్ కలిసి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ద్వేషించుకుంటూ పెట్టిన కామెంట్లు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి.

అలా ఆడియన్స్‌కు ఈ సినిమా గురించి కాస్త తెలిసింది. దీంతో ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్‌లు రిలీజ్ చేస్తూ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డట్‌ను మేకర్స్ వదిలారు. ఈ చిత్రం జూలై 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా.. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కడుపుబ్బా నవ్వించే కామెడీతో వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×