E-Paper
Advertisement

Pushpa 2: ఇదెక్కడి ట్విస్ట్.. పుష్ప కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా.. ?

Pushpa 2: ఇదెక్కడి ట్విస్ట్.. పుష్ప కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా.. ?
Advertisement

Pushpa 2: ఇండస్ట్రీలో ప్రేక్షకులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ విషయం ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటనే కానీ, అధికారికంగా లేకపోయేసరి అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు అధికారికం అవ్వడంతో ఈ వార్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలు ఆ రెండు సినిమాలు ఏంటివి.. ? ఎందుకంత స్పెషల్.. ఎవరా హీరోలు అనేది తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి సినిమాలో ఒకే నెలలో రిలీజ్ అయితే.. ఫ్యాన్స్ కు పూనకాలే. ఈ డిసెంబర్ దానికినిదర్శనంగా నిలవనుంది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రెండు సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను.. ఐకాన్ స్టార్ గా మార్చింది పుష్ప. ఈ సినిమాకు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు బన్నీ.

Advertisement

ఇక పుష్ప తరువాత పుష్ప 2 కోసమే మరో సినిమా చేయకుండా గడ్డం, హెయిర్ పెంచుతూ వస్తున్నాడు. సుకుమార్ కూడా మంచి ఔట్ ఫుట్ కోసం కష్టపడుతున్నాడు. అలా ముందు ఆగస్టు 15 న ఈ సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ,అప్పటికీ కూడా షూటింగ్ కాకపోయేసరికి.. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 24 కు పుష్ప 2 వాయిదా పడింది. సరే డిసెంబర్ కు అయినా వస్తుందిలే అనుకుంటే.. గత కొన్నిరోజుల నుంచి బన్నీకి, సుకుమార్ కి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ను ఫినిష్ చేయకుండా డైరెక్టర్ అమెరికా టూర్ వేశాడని టాక్ నడిచింది. అయితే ఈసారి కొత్తగా పుష్ప 2 వెనక్కి కాకుండా ముందుకు వచ్చి చేరింది.

అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 డిసెంబర్ 24 నుంచి 6 మారిందట. క్రిస్టమస్ డేట్ ను బన్నీ నుంచి చరణ్ లాగేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్ననే దిల్ రాజు డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ వస్తున్నట్లు ప్రకటించాడు. చరణ్ సైతం ఆర్ఆర్ఆర్ తరువాత తెరపై కనిపించబోతుండడంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 20 కి రెండు వారాలు గ్యాప్ ఉంది. మరి ఈ రెండు వారాల్లో పుష్ప విన్నర్ అవుతుందా.. ? లేక గేమ్ ఛేంజర్ ముందు రన్నర్ గా నిలుస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×