E-Paper
Advertisement

Raj Tarun: వివాదాలపాలైన హీరో.. వీర మాస్ లుక్.. ఇది అస్సలు ఊహించలేదే

Raj Tarun: వివాదాలపాలైన హీరో.. వీర మాస్ లుక్.. ఇది అస్సలు ఊహించలేదే
Advertisement

Raj Tarun: షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి హీరోగా మారాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాల అనే సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రాజ్ తరుణ్  ఆ తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ కుర్ర హీరోల్లో ఒకడిగా మారాడు.  విజయాపజయాలను పక్కన పెట్టి..  వచ్చిన అవకాశాలను  సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. అంతా బావుంటే అది జీవితం ఎందుకవుతుంది అన్నట్లు.. ఈ ఏడాది రాజ్ తరుణ్ ఎలాంటి వివాదంలో ఇరుక్కున్నాడో అందరికి తెల్సిందే.

రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య.. తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని, పెళ్లి చేసుకొని.. వేరే హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని  తిరుగుతున్నాడని పోలీస్ కేసు పెట్టింది. ఇక ఇప్పటివరకు రాజ్ తరుణ్ ఎవరో కూడా తెలియని వారికి కూడా ఈ వివాదం వలన ఈ హీరో పరిచయమయ్యాడు. సినిమాల వలన ఈ కుర్ర హీరో ఎంత ఫేమస్ అయ్యాడో తెలియదు కానీ, లావణ్య వివాదం వలన మాత్రం బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే లావణ్య చేసిన ఆరోపణలు అలాంటివి మరి.

Advertisement

ప్రేమించి, పెళ్లి చేసుకొని.. ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించాడని.. ఇప్పుడు తనను ఇంట్లో నుంచి గెంటేసాడని చెప్పుకొచ్చింది. ఇక రాజ్ తరుణ్ సైతం.. లావణ్యతో ఉన్న రిలేషన్ నిజమే కానీ, ఆమె డ్రగ్స్ అడిక్ట్ అని తెలిసాకా విడిపోయామని, ఇల్లు కోసం, ఆస్తికోసం.. లావణ్య ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఒక నెల రోజుల పోరాటం తరువాత లావణ్య.. తనంతట తానే ఈ కేసు నుంచి బయటకు వచ్చింది.

ఇక ఈ వివాదం వలన రాజ్ తరుణ్ సినిమాలకు ఎలాంటి ఎఫెక్ట్ పడలేదని తెలుస్తోంది. ఈ వివాదం నడిచేటప్పుడే పురుషోత్తముడు, తిరగబడరా సామీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్ లో అంతగా ప్రేక్షకులు ఆదరించకపోయినా .. ఓటీటీలో మంచి పాజిటివ్ టాక్ నే అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్..  మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం రామ్ భజరంగ్.

Advertisement

సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వాతి సుధీర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రత్ కౌర్, ఛాయా దేవి, మానస రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తాజగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్ లో  రాజ్ తరుణ్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు.. డీ గ్లామర్ గా.. ముఖం నిండా గాట్లు..  వీర మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ లా కనిపించడమే కానీ, మాస్ ఎప్పుడు ట్రై చేయని ఈ కుర్ర హీరో.. మొదటి ఈ రేంజ్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక పోతే ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×