E-Paper
Advertisement

Raj Tarun: ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. లీగల్ గానే ముందుకెళ్తా

Raj Tarun: ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. లీగల్ గానే ముందుకెళ్తా
Advertisement

Raj Tarun: షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా మారిన రాజ్ తరుణ్ విజయాపజయాలను పక్కన పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇక సినిమాల వలన రాజ్ తరుణ్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, ఈ మధ్య రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య చేసిన వివాదం వలన మాత్రం మరింత ఫేమస్ అయ్యాడు.

రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకొని తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా తనకు ఎన్నోసార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకొని కాపురం చేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ అప్పుడే స్పందించాడు.

Advertisement

తనతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ, ఆ తరువాత ఆమె బిహేవియర్ నచ్చక ఆమెతో మాట్లాడడం మానేశానని చెప్పుకొచ్చాడు. తన ఆస్తి కోసం లావణ్య ఇదంతా చేస్తుందని తెలిపాడు. ఇక లావణ్య మాత్రం ఎక్కడ తగ్గేదిలేదు అంటూ కేసులు మీద కేసులు పెడుతూ వచ్చింది. అప్పటినుంచి హైడింగ్ లో ఉన్న రాజ్ తరుణ్ .. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. నెల గ్యాప్ లోనే రాజ్ తరుణ్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇప్పటికే పురుషోత్తముడు సినిమా రిలీజ్ అవ్వగా.. తిరగబడరా సామీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఇక ఈ ప్రెస్ మీట్ లో లావణ్య గురించిన ప్రశ్నకు రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ” లావణ్య విషయంలో నేను ఆరోపణలు చేయడం లేదు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని చూపిస్తా.. లీగల్ గానే ముందుకెళ్తా. నా గురించి ఆమె చెప్పినవన్నీ ఆరోపణలు. అవే వింటున్నారు. అధరాలు చూపించమనండి. నేను చూపిస్తా. నేను మొదటి రోజే మీడియా మొత్తానికి క్లారిటీ ఇచ్చాను. ఆరోజు నేను ఏదైతే చెప్పానో అన్ని నిజాలు. త్వరలోనే అన్ని ఆధారాలతో నిజాలు నిరూపిస్తా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×