E-Paper
Advertisement

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి  డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
Advertisement

Pushpa 2:  ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే  కాదు పాన్ ఇండియా మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.  అన్ని బావుండి ఉంటే ఈపాటికి పుష్ప 2 వచ్చి రెండు నెలలు అయ్యేది.  కానీ,  మంచి సినిమాను ప్రేక్షకులకు చూపించడం కోసం సుకుమార్.. పుష్ప   2 ను  ఒక శిలను చెక్కినట్లు చెక్కుతున్నాడు.

ఇక మధ్యలో డైరెక్టర్ – హీరో ల మధ్య విభేదాల వలన  పుష్ప 2 ఇంకొంచెం ఆలస్యం అయ్యింది. ఇలా  ఆలస్యం  అవుతూ వచ్చి .. చివరకు డిసెంబర్ 2 న పుష్ప 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే  ఈ సినిమా నుంచి రిలీజైన  పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను  విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో దర్శకధీరుడు  రాజమౌళి   దర్శనమిచ్చాడు.

Advertisement

సాధారణంగా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు షూటింగ్ జరిగినప్పుడు  స్టార్స్.. అలా సెట్స్  కు వెళ్లి వస్తూ ఉంటారు. అది కాకుండా ఒకే చోట రెండు, మూడు సినిమాలు షూటింగ్ జరిగినప్పుడు  పలకరించి వస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఏ కారణమో తెలియదు కానీ.. పుష్ప 2 సెట్ లో జక్కన్న సందడి చేశాడు. ఈ విషయాన్నీ సుకుమార్ ..  ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో  పంచుకున్నాడు.

” డైరెక్టర్స్ అందరికి బాహుబలి మా పుష్ప 2  సెట్ కు వచ్చారు.  పుష్ప 2 సెట్‌లో రాజమౌళి గారిని కలవడం మరచిపోలేని అనుభూతి. అతని రాక.. మా సెట్‌ను మరింత చైతన్యవంతం చేసింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

నిజం చెప్పాలంటే .. రాజమౌళికి ఇష్టమైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ విషయాన్నీ జక్కన్న  బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా  సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం సినిమా అంటే  రాజమౌళికి మరింత ఇష్టం.  ఎప్పటినుంచో   ఫ్రెండ్స్  గా ఉన్న ఈ లెజెండ్స్  చాలా గ్యాప్ తరువాత ఇదుగో ఇలా కలిసి కనిపించడం  ఫ్యాన్స్ కు ఆనందంగా ఉంది.  మరి పుష్ప 2 తో సుకుమార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×