E-Paper
Advertisement

Rajendra Prasad: చివరి రోజుల్లో ఆయన్ను దుర్మార్గులు చాలా క్షోభ పెట్టారు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్

Rajendra Prasad: చివరి రోజుల్లో ఆయన్ను దుర్మార్గులు చాలా క్షోభ పెట్టారు.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్
Advertisement

Rajendra Prasad: మీడియా మొఘల్ రామోజీరావు నేడు కన్నుమూసిన సంగతి తెల్సిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం 3.45 నిమిషాలకు స్వర్గస్తులు అయ్యారు. ఆయన మరణంతో మీడియా ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రామోజీరావు పార్థీవదేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.

రామోజీరావు మృతిపట్ల సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆయను చివరి చూపు చూడడానికి తారాగణం క్యూ కట్టింది. షూటింగ్స్ కూడా పక్కన పెట్టి.. సినీ, రాజకీయ ప్రముఖులు.. రామోజీరావు పార్దీవ దేహానికి నివాళులు అర్పించడానికి కదిలివస్తున్నారు. ఇక నటుడు రాజేంద్రప్రసాద్.. రామోజీరావు పార్దీవ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

” రామోజీరావుగారు దేవుని సన్నిధానానికి చేరుకున్నారు. ఈ కంపెనీలోనే నేను హీరో అయ్యాను. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలను వారు బిడ్డలుగా .. దగ్గర కుర్చోబెట్టుకొని నేర్పించారు. వారు ఎప్పుడు చెప్పే ఒకే మాట. ప్రసాద్.. నీకు గుర్తింపు లేని చోట నువ్వు వేళ్ళకు.. నిన్ను ప్రేమించినచోటకే నువ్వు వెళ్ళు అని చెప్పేవారు. ప్రేమగా పెద్దాయన అని పిలుచుకునే రామోజీరావు గారు దేవా సన్నిధికి చేరుకున్న సందర్భంగా.. ఒక మాటను గుర్తుచేసుకోవాలి.

అంతటి మహానుభావుడు.. దరిద్రపు చెత్త రాజకీయాల వలన చివరికి మానసిక క్షోభను అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకున్నాడు. కానీ, ఆయన ఆ గెలుపు, నిజ గెలుపును ఆయన అనుభవించి.. అయన అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతికిఉన్నంతవరకు కొంతమందే బతికి ఉంటారు. అందులో రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర” అని ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×