Rajinikanth.. అర్ధరాత్రి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హుటాహుటిన కుటుంబ సభ్యులు చెన్నైలోనే అపోలో హాస్పిటల్ తరలించారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఆయన నార్మల్ చెకప్ లో భాగంగా గుండెకు చెకప్ చేయించుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ఆయన సన్నిహిత వర్గాలు కూడా తెలియజేసాయి.
రజినీకాంత్ కు ఆపరేషన్..
తాజాగా అందుతున్న మరో వార్త ప్రకారం రజనీకాంత్ కు ఆపరేషన్ పూర్తయిందని సమాచారం. మంగళవారం ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని , మరో మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు స్పష్టం చేశారు. ఇకపోతే కడుపునొప్పి కారణంగా ఆపరేషన్ చేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ ఆరోగ్యం పై ఆయన భార్య లతా స్పందన..
మరొకవైపు రజనీకాంత్ ఆరోగ్యం పై ఆయన భార్య లతా కూడా స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు .రజినీకాంత్ హాస్పిటల్ లో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురై వరుస పోస్ట్లు పెడుతున్నారు. దయచేసి ఎవరూ కంగారు పడకండి. ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఆయన క్షేమంగా ఉన్నారు అంటూ తెలిపింది లతా. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.
రజినీకాంత్ సినిమాలు..
ప్రస్తుతం రజినీకాంత్ ప్రముఖ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ సినిమాలో నటిస్తున్నారు
ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో కూడా రజిని పాల్గొని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కలిసి డాన్స్ వేసిన విషయం తెలిసిందే. అలా ఆరోగ్యంగా కనిపించిన ఈయన సడన్ గా హాస్పిటల్ పాలవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. . మరొకవైపు కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు.
రజనీకాంత్ కెరియర్..
బస్ కండక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈయన, ఆ తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించి అక్కడ నటనలో మెలుకువలు నేర్చుకొని, ఆ తర్వాత హీరోగా అడుగు పెట్టారు. ఈయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. కోలీవుడ్ కి చెందిన ఈయన 50 సంవత్సరాలు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అన్ని భాషలలో కలుపుకొని దాదాపు 160 కి పైగా చిత్రాలలో నటించారు రజనీకాంత్. 1975లో కే.బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగళ్ అనే చిత్రంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇక తర్వాత ఒక్కొక్క చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నేడు సౌత్ సూపర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకొని, అక్కడ జపాన్లో కూడా స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు.