Poonam Kaur: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ప్రసాదంలో కల్తీనెయ్యి కలిసింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయని, దేవుళ్లను రాజకీయం చేయవద్దని ప్రశ్నించింది. అసలు ఆధారాలు లేకుండా, సిట్ విచారణ పూర్తీ కాకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్లారని ఫైర్ అయ్యింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్లే అవుతుందని తెలిపింది.
ఇక సుప్రీం కోర్టు ప్రశ్నలతో కూటమి ప్రభుత్వం సైలెంట్ అయ్యింది. మొన్నటివరకు సనాతన ధర్మం అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అవ్వడంతో.. ఆయనపై ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. ఇక ఇదే అదునుగా భావించిన పూనమ్ కౌర్ .. మరోసారి పవన్ కళ్యాణ్ ను కెలికే ప్రయత్నం చేసింది. తాజాగా వెంకటేశ్వరస్వామి ఫోటో వద్ద నిలబడి దండం పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ.. గోవిందా.. గోవిందా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఇదేమి పూనమ్ భక్తి పారవశ్యంతో పెట్టిన ఫొటోలా అనిపించడం లేదు. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ చేసిన దానికి కౌంటర్ గా చెప్పినట్లు కనిపిస్తుంది. ఇన్ డైరెక్ట్ గా పవన్ పని గోవిందా అని సెటైర్ వేసినట్లు ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. పూనమ్ కు త్రివిక్రమ్ కు పవన్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంది అని చెప్పాలి. పూనమ్ ఈ మధ్యనే త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. అతను తనను వేధించాడని, మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే వారు తిరస్కరించారని తెలిపింది. అయితే త్రివిక్రమ్ వేధించింది పవన్ కోసమే అని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ వలనే పూనమ్ కెరీర్ నాశనం అయ్యిందని టాక్. పవన్ తరుపున వకాల్తా పుచ్చుకొని త్రివిక్రమ్.. పూనమ్ ను వేధించాడని సమాచారం. ఇక అప్పటి నుంచి పూనమ్.. త్రివిక్రమ్, పవన్ మీద పీకల్లోతు కోపాన్ని పెంచుకుందని, ఆ కోపాన్నే సందు దొరికినప్పుడల్లా పూనమ్ ఇలా ప్రదర్శిస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పూనమ్ ఎన్ని అన్నా.. త్రివిక్రమ్ కానీ, పవన్ కానీ తిరిగి మాట్లాడకపోవడం గమనార్హం.
#govinda Govinda 🙏 pic.twitter.com/vFPLJmhMPW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024