Matka Release Date: మెగా హీరో వరుణ్ తేజ్‌కు ప్రస్తుతం హిట్ చాలా అవసరం. తన గత సినిమాలు భారీ స్థాయిలో విడుదలయినా కూడా, వాటికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడి ఫ్లాపులుగా నిలిచాయి. అందుకే పక్కా హిట్ కొట్టడం కోసం ‘మట్కా’తో సిద్ధమయ్యాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకు ఈ సినిమా నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఒక గ్లింప్స్‌తో పాటు పలు పోస్టర్స్ మాత్రమే బయటికి వచ్చాయి. ఇంతలోనే ‘మట్కా’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఈ అనౌన్స్‌మెంట్ వెనుక పెద్ద ప్లాన్ ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే ప్లాన్
ఎన్నో అంచనాల మధ్య పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్‌గా ‘మట్కా’ సినిమా ప్రారంభమయ్యింది. కానీ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత సినిమాకు ఎన్నో సమస్యలు వచ్చాయి. బడ్జెట్ సమస్యల వల్ల కొంతకాలం షూటింగ్ కూడా ఆగిపోయింది. పీరియాడిక్ థ్రిల్లర్ కాబట్టి ‘మట్కా’ కోసం చాలానే బడ్జెట్ కావాల్సి వచ్చింది. దీంతో నిర్మాతలు చేతులు ఎత్తేశారు. మరి ఇన్ని సమస్యలు ఉండగా రిలీజ్ డేట్ ఎలా అనౌన్స్ చేశారు అనుకుంటే.. దాని వెనుక కూడా పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మట్కా’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావాలన్నా, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా ఫైనాన్సర్స్ కావాలి. వారి కోసమే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అని తెలుస్తుంది.
Also Read: ఎవరైనా ఫార్మల్ డ్రెస్ లో ఆ డ్యాన్స్ చేస్తారా? ‘గేమ్ ఛేంజర్’ పాటపై సామ్ రియాక్షన్
కేవలం దానికోసమే
‘మట్కా’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తే ఫైనాన్సర్స్.. ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారని నిర్మాత ప్లాన్ అంట. రిలీజ్ డేట్ దగ్గర పడుకుతున్నకొద్దీ దీని గురించి ఫైనాన్సర్స్‌కు రీచ్ అవుతుంది. దీంతో ఫైనాన్సర్స్ సాయంతో సినిమాకు ముందుకు కదిలే ఛాన్స్ ఉంది. అందుకే నవంబర్ 14న ఈ మూవీ విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వస్తుంది. ప్రేక్షకులతో పాటు ఫైనాన్సర్స్ కూడా మర్చిపోయిన ఈ సినిమా గురించి మళ్లీ టాలీవుడ్‌లో చర్చలు ఇప్పటికే మొదలయ్యాయట. ఒకవేళ నిర్మాతలు వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వకపోతే, పెట్టుబడి పెట్టడానికి ఫైనాన్సర్స్ ముందుకు రాకపోతే నవంబర్ 14న ‘మట్కా’ విడుదల కష్టమే అని తెలుస్తోంది.
భారీ నష్టాలు
ప్రస్తుతం ‘మట్కా’ మూవీపై ఎలాంటి హైప్ లేదు. వరుణ్ తేజ్ గత సినిమాలు కూడా ఫ్లాపులుగానే నిలిచాయి. ఆ ఎఫెక్ట్ ‘మట్కా’పై పడే అవకాశం కూడా చాలానే ఉంది. ఒకవేళ ప్రమోషన్స్ చేసినా కూడా మూవీకి కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో చాలా వెనకబడిపోతుంది. దీంతో నష్టాలు తప్పవు. బిగ్ టీవీకి అందిన సమాచారం ప్రకారం.. ‘మట్కా’ పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా చాలా సమయం పడుతుంది. దాంతో పాటు మరెన్నో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫైనాన్సర్స్‌ను ఆకర్షించడం కోసమే నవంబర్ 14న ఈ సినిమా విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు కానీ ఆరోజున ‘మట్కా’ విడుదల కష్టమే అని తెలుస్తోంది.