BigTV English

Rakul Preet : మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్.. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ..

Rakul Preet : మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్.. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ..

Rakul Preet :  టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో కుర్ర కారును ఉర్రూతలూరించింది.. ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తెలుగులో అవకాశాలు తగ్గడం తో బాలీవుడ్ కు చెక్కెసింది.. ఒక్క హిట్ సినిమా పడకపోయినా ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. సినిమాలు హిట్ అవ్వలేదని బాలీవుడ్ నిర్మాత తో ప్రేమలో పడింది.. రీసెంట్ గా మూడుముళ్ల బంధం తో ఒక్కటయ్యారు.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తూ వస్తుంది.


ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టింది.. తాజాగా కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిందని సోషల్ మీడియా ద్వారా పేర్కొంది.. మొన్నీమధ్య ఆరోగ్యం పేరుతో ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు అమ్మాయిల కోసం పీరియడ్స్ టైంలో రీ యూజ్ చేసేందుకు అండర్ వేర్ లను మార్కెట్ లోకి తీసుకో రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబందించిన ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ గా మారింది.

Rakul Preet Singh has entered into a new business
Rakul Preet Singh has entered into a new business

చాలా మంది సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు బిజినెస్ లు చేస్తున్నారు. సమంత, నయనతార, లాంటివారు ఈ విషయంలో ముందు ఉన్నారు. ఆ లిస్ట్ లోకి రకుల్ కూడా చేరింది.. పలు బిజినెస్ లు చేస్తూ బాగానే సంపాదిస్తుంది.. ఈమధ్య అవకాశాలు తగ్గడం.. టాలీవుడ్ కు కంప్లీట్ గా దూరం అయిపోయింది రకుల్.. బాలీవుడ్ లో అడపాదడపా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తోంది.. అలాగే ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ పార్లర్ ను నిర్వహిస్తున్నారు రకుల్. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్ వంటి బ్రాండ్స్‌లోనూ షేర్లు ఉన్నాయి.. సినిమాలు లేకున్నా బిజినెస్ లతో బాగానే సంపాదిస్తుంది. ఇప్పటికి కోట్లు వెనకేసుకుంటుంది..


రకుల్ ప్రస్తుతం సినిమాలను పక్కనపెట్టి వ్యాపారాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.. మొన్న ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.. ఆరంభం పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే .. క్యూర్‌ఫుడ్స్తో కలిసి సంయుక్తంగా ఈ బిజినెస్ ను చేయబోతున్నారట.. న్యూట్రిషన్ ఫుడ్ ను అందించనున్నారు.. తృణదాన్యాలతో వీటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.. మరి సినిమాలను పూర్తిగా వదిలేస్తుందా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది… ఏది ఏమైనా రకుల్ ముందు చూపుతోనే ఉంది.. డబ్బులను సంపాదిస్తుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×