E-Paper
Advertisement

Ram Charan: జనసేనాని గెలుపుపై యువసేనాని పోస్ట్.. గర్వంగా ఉంది అంటూ..

Ram Charan: జనసేనాని గెలుపుపై యువసేనాని పోస్ట్.. గర్వంగా ఉంది అంటూ..
Advertisement

Ram Charan: బాబాయ్ గెలుపు కోసం అబ్బాయ్ ఎంతలా పోరాడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించనప్పటి నుంచి రామ్ చరణ్ ఎప్పుడు వెన్నంటే ఉంటూ బాబాయ్ ను కాపాడుతూ వస్తున్నాడు. డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా తండ్రిని కానీ, బాబాయ్ ను కానీ ఎవరైనా ఏదైనా మాట అంటే.. ఎలాంటి పరిస్థితిలోనైనా చరణ్ అస్సలు ఊరుకోడు.

పవన్ కు నిత్యం తోడుగా ఉంటూ.. ఆయన గెలుపుకు కృషి చేసినవారిలో చరణ్ ముందు ఉంటాడు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా చరణ్.. బాబాయ్ కు తోడుగా నిలబడ్డాడు. చివరిరోజు ప్రచారంలో పిఠాపురంలో చరణ్ ఎంట్రీ.. పెద్ద రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి. బాబాయ్- అబ్బాయ్ అలా అభిమానులకు అభివాదం చేయడం చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

Advertisement

ఇక అప్పటినుంచి చరణ్ కు యువసేనాని అని బిరుదును కూడా ఇచ్చేశారు. ఎంతగా అభిమానులు ఇబ్బంది పెట్టినా కూడా చరణ్.. ఎంతో సహనంగా ఆలయంలో బాబాయ్ గెలవాలని పూజలు జరిపించాడు. ఇక ఆ దేవుడి అనుగ్రహంతో పవన్ భారీ మెజారిటీతో గెలిచి చూపించాడు. ఈ విజయాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటూ.. పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం పవన్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంది.

తాజాగా అబ్బాయ్ కూడా.. బాబాయ్ విజయంపై ట్వీట్ చేసాడు. ” మా కుటుంబానికి గర్వకారణమైన రోజు.. అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. యువసేనాని.. జనసేనాని గెలవడంతో నీ వంతు పాత్ర కూడా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×