E-Paper
Advertisement

Ram Charan in Oscar Panel : రామ్ చరణ్ కు అరుదైన గౌరవం .. మెగా ఫ్యాన్స్ సంబరాలు ..

Ram Charan in Oscar Panel  : రామ్ చరణ్ కు అరుదైన గౌరవం .. మెగా ఫ్యాన్స్ సంబరాలు ..
Advertisement
Ram Charan Oscar

Ram Charan in Oscar Panel : చిరుత మూవీతో మెగా వారసుడుగా సినీ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఎంతో అంకితభావంతో తన కెరియర్ పై కృషి చేశాడు కాబట్టి చరణ్ ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. మెగా వారసుడిగా, చిరంజీవి కొడుకుగా.. కాకుండా రామ్ చరణ్ గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలిగాడు. అలాంటి రామ్ చరణ్ తన కెరీర్లో మరొక ఘనత సాధించాడు.

ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో రీసెంట్ గా ఎన్టీఆర్ సభ్యత్వం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ అరుదైన గౌరవాన్ని రామ్ చరణ్ కూడా అందుకున్నాడు. ఇదే విషయాన్ని ఆస్కార్ అకాడమీ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాను మెగా అభిమానులు రామ్ చరణ్ కు కంగ్రాజులేషన్స్ చెప్తూ పలు రకాల పోస్ట్స్, మిమ్స్ తో నింపేశారు. ఇక ఈ జాబితాలో చరణ్ తోపాటు హాలీవుడ్ యాక్టర్స్ లషనా లించ్, విక్కీ క్రీప్స్ , లూయిస్ కూ టిన్ లోక్, కెకె పామర్, చాంగ్ చెన్ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ అందరి పేర్లతో కూడిన జాబితాను ఆస్కార్ నిర్వాహకులు విడుదల చేశారు.

అలాగే ఇటువంటి అద్భుతమైన నటులను మా యాక్టర్స్ బ్రాంచ్ లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉంది. వీరు తమ నటనతో అందరి మనసుల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని. తమ వైవిధ్యమైన నటనతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అని ఈ పోస్టులో రాసుకొచ్చారు ఆస్కార్ నిర్వాహకులు. ఇక మెగా అభిమానులు ప్రస్తుతం రామ్ చరణ్ సాధించిన ఈ అరుదైన ఘనతను ఫుల్ వైరల్ చేస్తున్నారు.

Advertisement

మరి రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత అతను చేసే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పక్కా పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం. వచ్చే సంవత్సరం ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే బుజ్జి బాబు కాంబోలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మరొకచిత్రం రామ్ చరణ్ చేయబోతున్నాడు. వీటితో పాటుగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ ఈ గ్లోబల్ స్టార్ కోసం లైన్ అప్ లో ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×