E-Paper
Advertisement

Ram Charan: అక్కినేని ఈవెంట్.. గ్లోబల్ స్టారే హైలైట్.. ఏం లుక్ రా బాబు.. మెంటల్ ఎక్కించేశాడు

Ram Charan: అక్కినేని ఈవెంట్.. గ్లోబల్ స్టారే హైలైట్.. ఏం లుక్ రా బాబు.. మెంటల్ ఎక్కించేశాడు
Advertisement

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. చరణ్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు లుక్ పరంగా ఎన్నో విమర్శలు  అందుకున్నాడు. అసలు చిరు కొడుకేనా .. ఆయన పోలికలే రాలేదు అంటూ విమర్శించారు. కానీ, చరణ్ మాత్రం వాటినేమి పట్టించుకోకుండా తన సత్తా చూపిస్తూ వచ్చాడు. లుక్ పరంగా, నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. చిరు కొడుకు చరణ్ అనే ట్యాగ్ లైన్ ను మార్చి చరణ్ తండ్రి చిరు అని అనిపించుకున్నాడు.

నటన విషయంలో, కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఏ ఈవెంట్ కు వెళ్లినా.. చరణ్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి లేదు. తాజాగా  ఈ మెగా హీరో.. అక్కినేని ఈవెంట్ లో హైలైట్ గా మారాడు. నేడు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ అతిరథ మహారథులు అందరూ ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

Advertisement

Sobhita Dhulipala: ఏఎన్నార్ అవార్డ్స్ వేడుక.. అక్కినేని కొత్త కోడలి రాయల్ ఎంట్రీ అదుర్స్

ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి అందుకుంటున్న విషయం విదితమే. అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. తండ్రి అవార్డును అందుకోవడం కళ్లారా చూడడానికి గ్లోబల్ స్టార్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. ఇక అక్కడ ఎంతమంది స్టార్స్ ఉన్నా తన స్టైలిష్ లుక్ తో చరణ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్, స్టైలిష్ కళ్లజోడు, గుబురు గడ్డంతో ఎంతో అద్భుతంగా కనిపించాడు.  ప్రస్తుతం చరణ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

RC16 కోసం చరణ్ తన లుక్ మొత్తాన్ని మార్చనున్నాడు.  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. RC16 లో ఈ లుక్ తో చరణ్ కనిపిస్తే థియేటర్ లో పూనకాలు గ్యారెంటీ. త్వరలోనే ఈ సినిమాలో చరణ్ అడుగుపెట్టనున్నాడు.  ఇక చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి రేసులో దిగిన విషయం తెల్సిందే.  దివాళీకి గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.  మరి ఈ సినిమాతో చరణ్- శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×