E-Paper
Advertisement

Ram Charan : ఖైరతాబాద్ ఆర్డిఏ ఆఫీస్ లో రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిపోయింది..

Ram Charan : ఖైరతాబాద్ ఆర్డిఏ ఆఫీస్ లో రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిపోయింది..
Advertisement

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మొదట డిసెంబర్ అనుకున్నా కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేసుకుంది. ఆల్రెడీ 2025 కు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ కూడా చేరింది. ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు కానీ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆయన ఖైరతాబాద్ లోని ఆర్డిఏ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ కెమెరాలు బందించిన లుక్ ఇదే.. మొన్నటివరకు క్లిన్ సేవ్ లో కనిపించిన ఈ హీరో ఇప్పుడు మోడ్రెన్ లుక్ లో స్టైలిష్ గా కనిపించాడు.. రామ్ చరణ్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బ్రాండ్‌ను కాపాడుకుంటూ వస్తున్నట్లు సమాచారం. రోల్స్ రాయిస్ షోరూంలో కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి వివరాలను కంపెనీ ప్రతినిధులు ఆరా తీస్తారు. అందులో పాసైతే కారు రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అందుకే ఖైరతాబాద్ లోని ఆఫీస్ కు వెళ్ళాడు రామ్ చరణ్.. ఇక రామ్ చరణ్ తన కొత్త కారు ‘ TG 09 2727’ రోల్స్ రాయిస్‌ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు. జేటీసీ రమేశ్‌.. చరణ్‌ కారు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన సేవలను అందించారు. రామ్‌చరణ్ రవాణాశాఖ కార్యాలయానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తన సెల్ఫీలు దిగారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన గ్యారేజి లోకి మరో ఖరీదైనా కారు వచ్చి చేరింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కియారా అద్వాని కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో rc16 సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 సినిమా చెయ్యనున్నాడు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×