E-Paper
Advertisement

Ram Charan: స‌ల్మాన్ , వెంకీల‌తో క‌లిసి లుంగీ డాన్స్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: స‌ల్మాన్ , వెంకీల‌తో క‌లిసి లుంగీ డాన్స్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌
Advertisement

Ram Charan: బాలీవుడ్‌ భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో మెగావపర్‌ స్టార్‌ స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తారన్నప్పటి నుంచీ అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచ‌నాల‌న్నింటినీ ఒక్క స్టెప్‌తో, ఒక్క సాంగ్‌తో బీట్‌ చేసేలా మ‌న ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్‌. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, విక్ట‌రీ వెంక‌టేష్, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క‌లిసి డాన్స్ చేసిన ఈ పాట అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఊర్రుత‌లూగించేలా ఉంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చిన తీరు, ఆయ‌న ఎనర్జీ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చి పెట్టింది.

మెరిసిపోయేలా ప‌సుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్‌ ఎంట్రీ, ఆయ‌న రియ‌ల్ లైఫ్ ఫ్రెండ్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ వెంకీల‌తో వేసిన డాన్స్ వావ్ అనిపిస్తోంది. మ‌న RRR స్టార్ తనదైన స్టైల్‌, గ్రేస్‌కి క‌లిసి వేసిన స్టెప్పుల‌తో పాట మ‌రింత అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తోంది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులు అద్దిరిపోయాయి. ఏంటమ్మా పాటలో ముగ్గురు హీరోలు పక్కపక్కన షేక్‌ చేసే స్టెప్పులేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవట్లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

విడుదలైన క్షణం నుంచే వైరల్‌ అవుతోంది సాంగ్‌. బాలీవుడ్‌ సినిమాలో ఏంటమ్మా సాంగ్‌కు ఈ గ్రాండ్‌ ఎలివేషన్‌ తెలుగు పాటకు అందిన గౌరవం అంటూ నెట్టింట్లో మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సీని ప్రేమికులకు సల్మాన్ ఖాన్ నుంచి అందిన ప్రత్యేకమైన బాహుబలి అని అంటున్నారు అభిమానులు

ఈ రోజు వేడుకగా ఉంటుంది ఉంటుంది అంటూ నాన్‌స్టాప్‌గా పాట పాడుకుంటూనే ఉన్నారు మెగాపవర్‌స్టార్‌ చెర్రీ ఫ్యాన్స్.వెండితెరపై మర్చిపోలేని క్షణాల్లో ఇవి కూడా ఉన్నాయంటూ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. లవ్‌ యూ భాయ్‌ అంటూ సల్మాన్‌ మీద తనకున్న ప్రేమను ఆ ట్వీట్‌లో ఎక్స్ ప్రెస్‌ చేశారు రామ్‌చరణ్‌. ఇద్దరు లెజెండ్స్ తో స్టెప్పులేయడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు చరణ్‌.

Advertisement

ఈద్‌కి విడుదల కానుంది కిసి కా భాయ్‌ కిసీ కీ జాన్‌. పాయల్‌ దేవ్‌ స్వరపరచిన ఏంటమ్మా పాట తప్పకుండా భాయ్‌ ఫ్యాన్స్ కి స్పెషల్‌ ట్రీట్‌ అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×