E-Paper
Advertisement

Ram Charan : RC16… ఆసక్తికరమైన పోస్టర్ అనౌన్స్‌మెంట్

Ram Charan : RC16… ఆసక్తికరమైన పోస్టర్ అనౌన్స్‌మెంట్
Advertisement

Ram Charan : RRRతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC15 చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా మూవీ రూపొంద‌నుంది. రామ్ చ‌ర‌ణ్‌కున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యూనివర్స‌ల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా బుచ్చిబాబు ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌ను సిద్ధం చేశారు. వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ‌ ఈ మూవీతో లాంచ్ అవుతుంది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట స‌తీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

RC 16… స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఇందులో రామ్ చరణ్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుకుమార్ తన శిష్యుడికి సపోర్ట్‌గా నిలిచే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చరణ్, శంకర్ కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది. ఇప్పుడు న్యూజిలాండ్‌లో పాట చిత్రీకరణ జరుగుతుంది. ఇదొక పొలిటిలక్ థ్రిల్లర్. కియారా అద్వానీ హీరోయిన్. ఎస్.జె.సూర్య ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించబోతున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా.. మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×