E-Paper
Advertisement

Ramayana: బాలీవుడ్ రామాయణ.. రంగంలోకి ఆస్కార్ విన్నర్లు.. ?

Ramayana: బాలీవుడ్ రామాయణ.. రంగంలోకి ఆస్కార్ విన్నర్లు.. ?
Advertisement

Ramayana: ఇండస్ట్రీలో అందరిచూపు ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం మీదనే ఉంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో ఓం రౌత్ ఒకలాంటి రామాయణాన్ని తీసి విమర్శలు అందుకున్నాడు. ఈసారి అలా కాకుండా అసలైన రామాయణాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు బాలీవుడ్ మేకర్స్. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణ తెరకెక్కుతుంది.

Advertisement

రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనుంది. ఇక రావణుడిగా కెజిఎఫ్ హీరో యష్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు ఆస్కార్ అవార్డు విన్నర్స్ ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. వారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, హన్స్ ఫ్లోరియన్ జిమ్మెర్.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ వ్యహరిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జర్మన్ ఫిల్మ్ స్కోర్ కంపోజర్ హన్స్ ఫ్లోరియన్ జిమ్మెర్ ను తీసుకొచ్చారట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాను సహాయ చేస్తోంది. హన్స్ ఫ్లోరియన్ జిమ్మెర్.. ఇప్పటికీ రెండుసార్లు ఆస్కార్ అవార్డును, నాలుగు గ్రామీలు, మూడు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నాడు. రామాయణ కోసం ఆయనను తీసుకొచ్చారు అనగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఈ చిత్రం ఏప్రిల్ 17.. శ్రీరామనవమి సందర్భంగా గ్రాండ్ గా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×