BigTV English

Mr Bachchan: హీరోయిన్స్ తో రవితేజ చేసే రొమాన్సే వేరయ్యా..

Mr Bachchan: హీరోయిన్స్ తో రవితేజ చేసే రొమాన్సే వేరయ్యా..

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, భాగ్య‌శ్రీ బొర్సె జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, షో రీల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే.


ఇక ఈ మధ్య మిస్టర్ బచ్చన్ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తామని అభిమానులకు మాట ఇచ్చినట్లే రోజుకో అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ఫెస్టివ‌ల్ మొదలైనట్లు తెలుపుతూ.. మొదటి పాటకు ముహూర్తం పెట్టారు. అంతేకాకుండా మొదటి సాంగ్ ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. రొమాంటిక్ సాంగ్ తోనే మ్యూజికల్ ఫెస్టివల్ ను మొదలుపెట్టారు.

సాంగ్ ఏంటో తెలియదు కానీ, ప్రోమోలో మాత్రం రవితేజ, భాగ్యశ్రీ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రవితేజ ప్రతి సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అది కూడా అలా ఇలా కాదు.. ఇక ఇందులో కూడా అలాంటిదే ఉంటుందని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది.


లంగా వోణిలో భాగ్యశ్రీ అందం ఒక ఎత్తు అయితే.. ఆమెతో రవితేజ రొమాన్స్ మరో ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమా కథ 90 వ దశకంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మిస్టర్ బచ్చన్ తో రవితేజ- హరీష్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×