E-Paper
Advertisement

Ram Charan Role in Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’ అప్డేట్ వచ్చేసింది.. రామ్ చరణ్ రోల్ ఎలా ఉంటుందో చెప్పిన డైలాగ్ రైటర్

Ram Charan Role in Game Changer: ‘గేమ్ ఛేంజర్‌’ అప్డేట్ వచ్చేసింది.. రామ్ చరణ్ రోల్ ఎలా ఉంటుందో చెప్పిన డైలాగ్ రైటర్
Advertisement

Ram Charan Role in ‘Game Changer’ Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత రెండెళ్ల క్రితం పట్టాలెక్కించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఇంకా చెక్కుతూనే ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

పొలిటికల్ యాక్షన్ డ్రామాలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త బయటకొచ్చినా.. ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా మరో వార్త మెగా అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఫుల్ ఎనర్జీ నింపింది.

ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్న ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాతో పాటు ఇందులో రామ్ చరణ్ పాత్ర గురించి ఆసక్తికర అప్డేట్ అందించి సినిమాపై ఫుల్ హైప్ పెంచేశారు.

Advertisement

READ MORE: ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే చిత్రాలివే.. ఏకంగా 35 సినిమాలా..?

ఈ ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్ ఈ మూవీలో ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తారా? లేక క్లాస్ రోల్‌లో కనిపిస్తారా అని అడిగిన ప్రశ్నకి ఆయన అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్‌కి మల్టిపుల్ వేరియేషన్స్‌ ఉంటాయని అన్నారు. మాస్, క్లాస్, రగ్గడ్, డిగ్నిఫైడ్.. ఇలా మీరు ఏది కోరుకుంటే అది ఆ పాత్రలో కనిపిస్తుందని తెలిపారు.

అందులో చరణ్‌లో ఆ షేడ్స్ అన్నీ కనిపిస్తాయని అన్నారు. ఒక సామాన్యుడు తన జీవితంలో వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఎలా అయితే ప్రవర్తిస్తాడో.. అలానే గేమ్ ఛేంజర్‌ మూవీలో కథానాయకుడి పాత్రను రూపొందించారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఆయన మాటలకు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్, అంజలి, శుభలేక సుధాకర్ వంటి నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

READ MORE: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత

ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ అనంతరం రామ్ చరణ్.. మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘ఆర్‌సి 16’ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీకి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ ఈ మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఇటీవల ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×