E-Paper
Advertisement

Sai Rajesh : మా ప్రొడ్యూసర్ తిట్టుకున్న పర్లేదు, చెప్తే ఇది కాంట్రవర్సీ అవుతుంది

Sai Rajesh : మా ప్రొడ్యూసర్ తిట్టుకున్న పర్లేదు, చెప్తే ఇది కాంట్రవర్సీ అవుతుంది
Advertisement

Sai Rajesh : కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎటువంటి విజయాన్ని సాధిస్తాయి అని ఎవరు ఊహించలేరు. అలానే ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నమ్మే సిద్ధాంతం ఇక్కడ కంటెంట్ కింగ్ అని. అలా కంటెంట్ నమ్ముకుని వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. పెద్ద పెద్ద సినిమాలతో పాటు రిలీజ్ అయిన చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసాయి. రీసెంట్ టైమ్స్ లో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ వంటి సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి. అలానే మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక అలా చిన్న సినిమాగా ఒకప్పుడు సంచలనం సృష్టించింది బేబీ.

సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్ కీలకపాత్రలో కనిపించారు. అయితే ఈ లవ్ స్టోరీ రిలీజ్ అవ్వకముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. సినిమా రిలీజ్ కంటే ముందు రోజు ప్రీమియర్ షోస్, హైదరాబాద్లో వేసారు. ఈ ప్రీమియర్ షోస్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే టీం మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని చెప్పాలి. నిర్మాత ఎస్ కే ఎన్ సినిమా పూర్తి బయటికి వచ్చిన వెంటనే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సినిమాకి నార్మల్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పెట్టారు. కాలేజ్ స్టూడెంట్స్ అంతా విపరీతంగా ఆ సినిమాను ఎంజాయ్ చేశారు. అలానే ఆ కథను నిబ్బాని బి అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.

Advertisement

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దర్శకుడు సాయి రాజేష్. అయితే ఈ సినిమాలో బాగా హిట్ అయిన పాట “ఓ రెండు ప్రేమ మేఘాలు”. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినప్పుడే బ్యాగ్రౌండ్ లో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. టీజర్ లో హైలెట్గా నిలిచింది కూడా ఈపాటే. ఈ పాటే సినిమా మీద చాలా అంచనాలను పెంచింది అని చెప్పాలి. అయితే ఈ పాట విషయానికి వస్తే ఈ పాట కనీసం 100 మిలియన్ వ్యూస్ దాటుతుంది అని దర్శకుడు సాయి రాజేష్ ఎక్స్పెక్ట్ చేశారట. అయితే ఈ పాటకు 1 మిలియన్ అండ్ ఆఫ్ వచ్చిన తర్వాత సడన్ గా వ్యూస్ ఆగిపోయాయి. ఆ తర్వాత దీన్ని 5 మిలియన్ వ్యూస్ వరకు దర్శకుడు సాయి రాజేష్ పుష్ చేశారు. ఈ విషయం చెబుతూ మా నిర్మాత ఏమనుకున్న పర్లేదు ఫైవ్ మిలియన్ వ్యూస్ వరకు నేను పోస్ట్ చేశాను అంటూ రివిల్ చేశారు. అలానే ఇది చెప్తే ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది అని కూడా తెలిపారు.

మొత్తానికి ఓ రెండు ప్రేమ మేఘాలు అనే పాట కొన్ని రీల్స్ వలన బాగా పాపులర్ అయింది. ఎక్కడపడితే అక్కడ ఆ పాట వినపడుతూ వచ్చింది. ఇప్పటికీ కొన్నిచోట్ల ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అంత మంచి మ్యూజిక్ ని అందించాడు సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్. ఈ సినిమాకి విజయ్ అందించిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. అలానే చాలా సందర్భాల్లో విజయ్ మ్యూజిక్ గురించి, విజయ్ కి మ్యూజిక్ మీద ఉన్న అవగాహన గురించి చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు దర్శకుడు సాయి రాజేష్. ఇక బేబీ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు 50 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. అలానే ఎస్కేఎన్ ను టాప్ ప్రొడ్యూసర్ చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×