E-Paper
Advertisement

Actor Sampath Ram: సలార్ నటుడు సంపత్ రామ్ కు కారు ప్రమాదం..

Actor Sampath Ram: సలార్ నటుడు సంపత్ రామ్ కు కారు ప్రమాదం..
Advertisement

Actor Sampath Ram: కోలీవుడ్  నటుడు సంపత్ రామ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గతరాత్రి చెన్నై గిండి సమీపంలో సంపత్ రామ్ ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో .. వెనుక కారు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో సంపత్ .. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

ఇక సంపత్ రామ్.. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సంపత్ సుపరిచితుడే. 1999 లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ముల్తువన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సంపత్ . ఈ సినిమా  తరువాత విలన్ గా , సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తూ వస్తున్నాడు. ఇక తెలుగులో సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో కూడా నటించాడు. ప్రభాస్ ను వెతికే వేద పాత్రలో ఆయన కనిపించాడు. ఈ సినిమా అతనికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది.

Advertisement

ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన  తంగలాన్ సినిమాలో సంపత్ రామ్ కీలక పాత్రలో నటించాడు. 75 కు పైగా తమిళ్ సినిమాల్లో నటించిన సంపత్ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఆయన కారు ప్రమాదానికి గురికావడం షాకింగ్ గా ఉందని పలువురు   కామెంట్స్ పెడుతున్నారు.

సంపత్ రామ్  త్వరగా కోలుకోవాలని ప్రముఖులు కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సంపత్ రామ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు  సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×