E-Paper
Advertisement

Somy Ali on Sushant Death: సుశాంత్ మరణం పై సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Somy Ali on Sushant Death: సుశాంత్ మరణం పై సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Somy Ali on Sushant Death..బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎవరి అండ లేకుండా అడుగుపెట్టి, అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) స్వయంకృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్నారో.. ఇటు బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అలాగే పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఈయన స్టార్ స్టేటస్ ను ఓర్వలేక కొంతమంది ఈయనను తొక్కేసే ప్రయత్నం చేశారని , అందులో భాగంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి.

సుశాంత్ మరణం పై సోమీ అలీ కామెంట్స్..

Advertisement

అయితే తాజాగా సల్మాన్ ఖాన్ (Salman Khan) మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ (Somi Ali) తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై సంచలన కామెంట్లు చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీ సల్మాన్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత అతడు తనను ఏ విధంగా వేధించాడు అనే విషయాలను బయటపెట్టిన ఈమె, ఈసారి సుశాంత్ మరణం పై స్పందించింది. సుశాంత్ ది ఆత్మహత్య కాదని, అతడిది హత్య అని, పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు అని తెలిపింది. అయితే అతడి పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ డాక్టర్ సుదీర్ గుప్తా ఎందుకు మార్చారో..? అడగండి అంటూ కూడా కామెంట్లు చేసింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

మెడికల్ బోర్డు పై ఆరోపణలు..

Advertisement

ఇకపోతే 2020 అక్టోబర్ లో సుశాంత్ రాజ్ పుత్ తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించారు. ఎయిమ్స్ డాక్టర్ బోర్డ్ దీనిని ఆత్మహత్యగా చెప్పింది. అయితే ఆ సమయంలో హత్యా ఆరోపణలు వచ్చినా ఎయిమ్స్ డాక్టర్ బోర్డు దీనిని తోసిపుచ్చింది. ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం గొంతు నులిమి, విషమిచ్చి చంపడం వంటి ఆరోపణలను కూడా తోసిపుచ్చింది. అయితే ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా మాత్రం సుశాంత్ సింగ్ మరణానికి ఉరి వేసుకోవడమే కారణమని, అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు అని నివేదించాడు.

జియాఖాన్ పై కూడా కామెంట్స్..

దీని తర్వాత బాలీవుడ్ నటి జియా ఖాన్ కూడా గర్భవతిగా ఉన్న సమయంలోనే ఉరి వేసుకొని చనిపోయింది. ఆమె మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ని సూరజ్ పంచోలి సలహాలు కోరాడు అంటూ సోమీ అలీ ఆరోపణలు చేసింది. సుశాంత్, జియా మరణానికి న్యాయం కావాలి అని సోమీ అలీ కోరుతోంద. అదే సమయంలో సల్మాన్ ఖాన్ పై కూడా ఈమె ఆరోపణలు చేస్తోంది. సల్మాన్ ఖాన్ ను తాను విడిచిపెట్టనని, రోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని కచ్చితంగా సల్మాన్ ఖాన్ కి బుద్ధి చెప్పి తీరుతాను అంటూ కూడా సోమీ అలీ రెడ్డిట్ లో చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×